AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2023-24: ఏపీ బడ్జెట్ సమావేశాలకు వేళాయే.. వ్యవసాయ రంగంపై జగన్ సర్కార్ స్పెషల్ ఫోకస్..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి.

AP Budget 2023-24: ఏపీ బడ్జెట్ సమావేశాలకు వేళాయే.. వ్యవసాయ రంగంపై జగన్ సర్కార్ స్పెషల్ ఫోకస్..
Andhra CM Jagan Mohan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 13, 2023 | 9:49 PM

Share

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభను ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవుతుంది. గవర్నర్ ప్రసంగంతోపాటు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనుంది మంత్రి వర్గం. ఈ నెల 16న సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్‌నూ ప్రవేశపెట్టనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో 12 బిల్లుల్ని ప్రవేశపెడుతారని తెలుస్తోంది. ఉగాది, ఆదివారం మినహా మిగతా రోజుల్లో సభను జరిపే యోచనలో ఉంది ప్రభుత్వం. అయితే, ముందుగా ఈ నెల 18వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో.. ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 16న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ బడ్జెట్ సమావేశాలు.. మొత్తం 11 రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో జీ-20 సదస్సు ఉండటంతో దానికంటే ముందుగానే సమావేశాలు ముగించేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిసింది. ఒకవేళ తప్పనిసరి అయితే 30, 31 తేదీల్లో కూడా సభ జరగనుంది.

గతేడాది 2 లక్షల 56 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం….ఈసారి 2 లక్షల 62వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై తీర్మానం చేసి అవకాశం ఉంది. మహిళాభివృద్ధి, విశాఖ పెట్టుబడుల సదస్సుపై కీలక చర్చ జరగనుంది.

ఇవి కూడా చదవండి

టీడీపీ అధినేత చంద్రబాబు సభకు హాజరుకావడం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే వస్తారు. పదవీకాలం ముగుస్తుండటంతో నారా లోకేష్ తో పాటు కొంతమంది ఎమ్మెల్సీ లకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో