Blood Donation: మహత్తరం.. గర్భంతో ఉన్న కుక్కకు మరో కుక్క రక్తదానం చేసింది..

దాంతో వైద్యులు కుక్క ప్రాణాలకు ముప్పు ఉందని, దానిని కాపాడేందుకు వెంటనే మరో కుక్క నుంచి రక్తం ఎక్కించారు. ఈ ఘటన యావత్‌ జంతుప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. ఆ రెండు పెంపుడు కుక్కల యజమానులను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

Blood Donation: మహత్తరం.. గర్భంతో ఉన్న కుక్కకు మరో కుక్క రక్తదానం చేసింది..
Haveri Dog Blod Donate
Follow us

|

Updated on: Mar 14, 2023 | 2:47 PM

రక్తదానం చేయడం అంటే.. ప్రాణదానం చేయడమే. రక్తదానంలోనే దానం అనే మాట ఉంది. ఒకరు రక్తదానం చేయడం వల్ల.. ముగ్గురి ప్రాణాల్ని కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడాలంటూ అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. అవును, జంతువులకు సైతం అత్యవసర సమయాల్లో రక్తం అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆపదలో ఉన్న ఒక కుక్కకు మరో కుక్క రక్తదానం చేసి ప్రాణం పోసింది. ఈ అరుదై వింత సంఘటన కర్ణాటకలోని హావేరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని హావేరి జిల్లాలో లాబ్రడార్ జాతికి చెందిన గర్భిణీ కుక్క ప్రాణాన్ని కాపాడేందుకు ఓ కుక్క రక్తదానం చేసింది . జిప్సీ అనే లాబ్రడార్ రెండు నెలల గర్భవతి. ఆరోగ్య సమస్యల కారణంగా గర్భిణీ డాగ్‌ గత 5 రోజులుగా భోజనం చేయడం లేదు. ఈ విషయమై కుక్క యజమాని తన పెంపుడు కుక్క జిప్సీని తీసుకుని వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. దాన్ని పరీక్షించిన వైద్యులు.. కుక్క శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని , వెంటనే రక్తం ఎక్కించాలని చెప్పారు. దీంతో నిఖిల్ వైభవ్ పాటిల్‌ను సంప్రదించాడు. అతని వద్ద జిమ్మీ అనే మగ లాబ్రడార్‌ ఉంది. అతను జిప్సీకి రక్తదానం చేయడానికి అంగీకరించాడు. తర్వాత డాక్టర్ విజయవంతంగా రక్తాన్ని ఎక్కించారు. ఇప్పుడు జిప్సీ ఆరోగ్యంగా ఉంది.

జిప్సీ టిక్ ఫీవర్‌తో బాధపడుతోంది. గత 4-5 రోజులుగా ఆహారం తీసుకోలేదు. బాగా నిరసించిపోయింది. రక్త పరీక్షలో RBC, హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్స్ స్థాయి చాలా తక్కువగా ఉంది. దాంతో వైద్యులు కుక్క ప్రాణాలకు ముప్పు ఉందని, దానిని కాపాడేందుకు వెంటనే మరో కుక్క నుంచి రక్తం ఎక్కించారు. ఈ ఘటన యావత్‌ జంతుప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. ఆ రెండు పెంపుడు కుక్కల యజమానులను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం..