Watch Video: అమ్మ బామ్మోయ్.. నువ్వు యావత్ యువతకే ఆదర్శం.. వీడియో చూస్తే షాకే..
ప్రస్తుత రోజుల్లో 40 ఏళ్లు దాటడమే ఆలస్యం.. అప్పుడే వృద్ధులైపోయామన్నంతగా ఉంటారు కొందరు మనుషులు. అంతేకాదు 30 ఏళ్లు పైబడితే చాలు.. తుంటి నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు..
ప్రస్తుత రోజుల్లో 40 ఏళ్లు దాటడమే ఆలస్యం.. అప్పుడే వృద్ధులైపోయామన్నంతగా ఉంటారు కొందరు మనుషులు. అంతేకాదు 30 ఏళ్లు పైబడితే చాలు.. తుంటి నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ యావత్ ప్రపంచ యువత అవాక్కయ్యేలా జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తోంది ఓ వృద్ధ నారీ. ఆమె వయసు ఏ 60, 70 అనుకునేరు. అక్షరాలా 103 సంవత్సరాలు. అయినా, ఏమాత్రం అనారోగ్య సమస్యలు లేవు. స్టిల్ స్ట్రాంగ్ అంటోంది ఆ బామ్మ.
అవును, కాలిఫోర్నియాకు చెందిన 103 ఏళ్ల బామ్మ థెరిసా మూర్ ఇప్పటికీ వారానికి మూడు నాలుగు రోజులు జిమ్‌లో వ్యాయామం చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటోంది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న బామ్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చం పడుచమ్మాయిలా రెడీ అయి.. జిమ్‌కి వచ్చిన బామ్మ.. కసరత్తులు చేస్తోంది.
బామ్మ తన ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అలాగే కాపాడుకుంటుంది. తన స్నేహితులతో కలిసి పార్టీలకు కూడా వెళ్తుందట. 103 ఏళ్ల వయసులోనూ తన జీవితాన్ని హాయిగా, సంతోషంగా గడుపుతున్నానని చెబుతోంది బామ్మ. కాగా, ఇటలీలో జన్మించిన ఈ బామ్మ పేరు థెరిసా. 1946లో ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను సందర్శించింది.
థెరిసా ఇటలీలో జన్మించారు. 1946లో ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. అప్పటి నుండి ఆమె కూడా మంచి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అవలంభించడం, వ్యాయామం చేయడం వంటి చేస్తూ వస్తోందట. ఇప్పుడు 103 ఏళ్ల వయసులోనూ కంటిన్యూ చేస్తోంది బామ్మ. మొత్తంగా బామ్మ వర్కౌట్స్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
?| NEW: California 103-year-old woman still hits gym regularly: ‘Her happy place’‼️? pic.twitter.com/EEZQOe21c8
— Pubity (@Pubity) March 12, 2023
(Fox11 సౌజన్యంతో వీడియో)
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..