- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti for happy and prosper life follow these tips of acharya chanakya in telugu
Chanakya Niti: సంతోషం, విజయవంతమైన జీవితం కోసం చాణుక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను పాటించి చూడండి..
కొందరు ఎన్ని విజయాలను సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా అతనిలో ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. మితిమీరిన దురాశ వల్ల చాలాసార్లు తప్పులు కూడా చేస్తుంటారు. చాణక్యుడు ప్రకారం.. జీవితంలో కొన్ని విషయాలను పాటించడం వలన వాటిని అనుసరించడం వలన ఆనందం, సంతృప్తిని ఇస్తుంది
Updated on: Mar 14, 2023 | 12:06 PM


ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేసిన వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. దీనితో పాటు డబ్బు కూడా పెరుగుతుంది. అయితే తాము సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేసేవారు జీవితంలో చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు కూడా చెప్పాడు.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.

చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

చాణక్యుడు ప్రకారం మూర్ఖులు, ద్రోహులను గౌరవించే చోట లక్ష్మీదేవి నివసించదు. మూర్ఖుల మాటలు వినేవాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుందని చాణక్యుడు నమ్మాడు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని విశ్వసించండి.





























