- Telugu News Photo Gallery Spiritual photos Never do these vastu mistakes of pooja room or else health issues and financial issues may occur
Pooja Room Vastu: పూజ గది విషయంలో చేయకూడని తప్పులివే.. చేస్తే ఆర్థిక, ఆరోగ్య బాధలు తప్పవు..!
మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని ప్రగాఢంగా నమ్ముతారు. ఇంకా వాస్తు నియమాలను తూచా తప్పక పాటించి తీరుతారు. ఈ క్రమంలోనే వాస్తు ప్రకారం ఇంటిలోని పూజగది ఎల్లప్పుడు కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలలోనే ఉండాలి. అలాగే పూజగది కోసం గుర్తుంచుకోవలసిన వాస్తు చిట్కాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 13, 2023 | 6:15 PM

వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది సరైన దిశలో ఉండాలి. పూజగది సరైన దిశలో లేకుంటే పూజలకు ప్రయోజనం ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుకే పూజగది ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదికి దక్షిణం లేదా పడమర దిశ అశుభం. అదే సమయంలో ఇంటి గుడిలో రెండు శంఖాలను కలిపి ఉంచడం కూడా సరికాదు.

వాస్తు శాస్త్రం ప్రకారం, పూజగదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్టించకూడదు. ఇది అత్యంత అసహ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అంతే కాదు విరిగిన విగ్రహాలను పూజిస్తే దేవతలకు కోపం వస్తుంది.

వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడూ స్టోర్‌రూమ్, బెడ్‌రూమ్, బేస్‌మెంట్‌లో ఉండకూడదు. పూజా గది ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో నిర్మించాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని గుడిలో ఒకటి కంటే ఎక్కువ దేవుడి చిత్రాలను ఉంచవద్దు. అలాగే 3 వినాయక విగ్రహాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. దీని వల్ల ఇంటి శుభ కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.

హనుమాన్ పెద్ద విగ్రహాన్ని పూజగదిలో ఉంచకూడదని వాస్తు నిపుణులు అంటుంటారు. పూజగదిలో ఆయన విగ్రహం ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి. దీనితో పాటు, బజరంగ్ బలి కూర్చున్న విగ్రహాన్ని ఉంచడం మంచిదని చెబుతున్నారు. దీనితో పాటు, శివలింగం కూడా పూజగదిలో ఉండాలని వారి మాట.

Pooja Room

ఇంట్లోని పూజగదిలో ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే దేవుళ్ళ, దేవతల చిత్రాలను ఉంచాలి. అలా కాకుండా దేవతామూర్తుల ఉగ్ర రూపాల చిత్రాలను ఉంచవద్దు. అలా చేయడం అశుభంగా భావిస్తారు.




