Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగిన మరో చిట్టి గుండె.. శివుని ఆలయంలో కత్తిసాము చేస్తూనే శివైక్యం..

రంగ పంచమి సందర్భంగా ఉజ్జియాన్‌లో 'మహాకాల్ ధ్వజ్ చల్' వేడుకలో కత్తి తిప్పుతూ విన్యాసాలు చేశాడని.. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విశాధకర ఘటన..

ఆగిన మరో చిట్టి గుండె.. శివుని ఆలయంలో కత్తిసాము చేస్తూనే శివైక్యం..
17 Years Old Mayank
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 14, 2023 | 3:33 PM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ఓ విశాధ ఘటన జరిగింది. నిత్యం వినిపిస్తున్న హార్ట్ ఎటాక్‌తో మరో బాలుడు విగతజీవిగా మారాడు. అవును. ఉజ్జయినీ ఆలయ పురోహితుని 17 సంవత్సరాల కుమారుడు మయాంక్ చనిపోయాడు. అయితే ఆ నగరమంతా ఉజ్జయినిలో రంగ పంచమి పండుగను జరుపుకున్న తర్వాతే ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంతకముందే అతను రంగ పంచమి సందర్భంగా ఉజ్జియాన్‌లో ‘మహాకాల్ ధ్వజ్ చల్’ వేడుకలో కత్తి తిప్పుతూ విన్యాసాలు చేశాడని.. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విశాధకర ఘటన జరిగిందని ఆలయ పురుహితుని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు మయాంక్ ఆలయ వేడుకల సందర్భంగా కత్తి తిప్పుడూ చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Untitled 1

మహాాకళేశ్వరుడి పూజార్చనాది కార్యక్రమాలలో మయాంక్.. 

ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఉజ్జయినీ మహాకాళేశ్వరాలయంలోని గర్జన అట్టహాసంగా జరుగుతోందని, రంగ పంచమి నిర్వహణలో ఆలయ పుజారి మంగ్లేష్ శర్మ 17 ఏళ్ల కుమారుడు మయాంక్ కూడా నిమగ్నమై కత్తిసాము విన్యాసాలు చేస్తున్నాడని, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే అతనికి విన్యాసాలు చూస్తున్నప్పుడు గుండె దడగా అనిపించిందని.. అదే విషయాన్ని ఇంటికి వెళ్లి వారికి చెప్పాడని తెలిపారు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, మయాంక్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ తెలిపి.. గుండెపోటు వల్లే మయాంక్ మరణించాడని వివరించారు.

ఇవి కూడా చదవండి

రంగ పంచమి వేడుకలలో కత్తిసాము చేస్తున్న మయాంక్..

ఈ ఘటన గురించి తెలిసిన మరిన్ని వివరాల ప్రకారం మయాంక్ తండ్రి మంగేష్ శర్మ మహాకాళేశ్వర ఆలయంలో పూజారి. ఇంకా మయాంక్ అతనితో కలిసి పూజ కార్యక్రమాలు కూడా చేసేవాడు. అతను ఎప్పుడూ మహాకాల్(పరమ శివుడు) సన్నిధిలో ఉన్నానంటూ సంతోషించేవారు. 11వ తరగతి మయాంక్‌కు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మయాంక్ ఆకస్మిక మరణం తరువాత మహాకాల్ ఆలయ పూజారులు తీవ్ర సంతాపం తెలిపారు. కేవలం 17 సంవత్సరాలకే తమ బిడ్డ చనిపోవడంతో మంగ్లేష్ శర్మ దంపతులు, కుటుంబంలో విశాధ ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.