- Telugu News Photo Gallery The way we sit also reveals many secrets about our personality and way of thinking Telugu Lifestyle News
కూర్చునే విధానంతో కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.. ఆ వివరాలు మీ కోసం..
మనం నిలబడే విధానం, మాట్లాడే విధానం కూడా మన వ్యక్తిత్వం గురించి ఎదుటివారికి తెలియజేస్తాయని మనకు తెలిసిన విషయమే. అయితే మనం కూర్చునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనావిధానాన్ని తెలియజేస్తాయంట. ఇదేదో నోటి మాట కానే కాదు. అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైన విషయం ఇది. మరి ఆ క్రమంలో మీరు కూర్చున్న పోజిషన్ కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే ఏ సిట్టింగ్ పోజిషన్ వెనుక వ్యక్తిత్వానికి సంబంధించి ఏ ఆర్థం దాగి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 14, 2023 | 3:38 PM

మనం నిలబడే విధానం, మాట్లాడే విధానం కూడా మన వ్యక్తిత్వం గురించి ఎదుటివారికి తెలియజేస్తాయని మనకు తెలిసిన విషయమే. అయితే మనం కూర్చునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనావిధానాన్ని తెలియజేస్తాయంట. ఇదేదో నోటి మాట కానే కాదు. అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైన విషయం ఇది.

నిటారుగా కూర్చోవడం: నిటారుగా కూర్చునేవారిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అలాంటి వారు చాలా తెలివైనవారు. ఏ నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. వారు చాలా సమయపాలన పాటించేవారు. సమావేశాలు, ఇంటర్వ్యూలు, ఎక్కడైనా సమయానికి చేరుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా నిటారుగా కూర్చునేవారు తెలివైన పనులు చేయడానికి ఇష్టపడతాడు.. అది ఇల్లు అయినా, ఆఫీసు అయినా. అలాంటి వ్యక్తులు నిజాయితీపరులు కానీ వారు కొంత వరకు రిజర్వ్డ్ స్వభావం కలిగి ఉంటారు.

కాళ్లు తెరిచి కూర్చునే వారు కాస్త స్వీయ దృష్టితో ఉంటారు. వారి స్వభావం చాలా గర్వంగా, తీర్పునిచ్చే విధంగా ఉంటుంది. అయితే ఈ వ్యక్తులు చాలా త్వరగా విసుగు చెందుతారు. ఈ వ్యక్తులు మొదట తమకు నచ్చిన విధంగా మాట్లాడతారు, తరువాత ఆలోచిస్తారు.

క్రాస్ లెగ్: క్రాస్ లెగ్ పొజిషన్‌లో కూర్చున్న వ్యక్తులు చాలా సృజనాత్మక ఆలోచనాపరులు. వారికి చాలా కలలు ఉంటాయి. క్రాస్డ్ లెగ్ పోజిషన్‌లో కూర్చేనేవారు తమకు నచ్చినవారిని రక్షించే స్వభావాన్ని చూపుతారు.

చీలమండ క్రాస్డ్ లెగ్: చీలమండ క్రాస్డ్ లెగ్ పోజిషన్ అధిక విశ్వాసాన్ని చూపుతుంది. అలా కూర్చునే వ్యక్తులు చాలా డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారి చుట్టూ కూర్చున్న వారు కూడా చాలా నమ్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా మంచి శ్రోతలు. వారు తమ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడతే లక్షణాలను కలిగి ఉంటారు.





























