- Telugu News Photo Gallery Technology photos Cheap smartwatches are available in the market under Rs 3,000. Bluetooth and more good features
Smartwatch: స్మార్ట్‌వాచ్ కోనాలా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి.. ధర కూడా రూ.3 వేల కంటే తక్కువే..
Smartwatch under 3000: మీరు రూ. 3,000 కంటే చౌకైన స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకోసమే ఈ శుభవార్త. మార్కెట్లో చాలా బ్లూటూత్ స్మార్ట్‌వాచ్‌లు.. గొప్ప ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో ఉన్నాయి. వాటి ఖరీదు కూడా చాలా తక్కువగానే కావడం విశేషం. వాటి కోసం మీరు రూ.3000 కంటే తక్కువ చెల్లిస్తే చాలు. మరి ఆ స్మార్ట్‌వాచ్‌ల వివరాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 14, 2023 | 4:28 PM

Pebble Cosmos Smartwatch: పెబుల్ కొత్త అధునాతన బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ కాస్మోస్ బోల్డ్‌ను ఇటీవలి కాలంలోనే విడుదల చేసింది. వినియోగదారులు ఈ స్మార్ట్‌వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్, పెబుల్ వెబ్‌సైట్ నుంచి కేవలం రూ. 2,299లకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 1.39 అంగుళాల అల్ట్రా HD IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఇంకా ఇందులో హిందీ భాషా కూడా సప్పోర్ట్ చేస్తుంది.

Noise ColorFit Pro 4: నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 స్మార్ట్‌వాచ్ 1.72 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. వినియోగదారులు ఈ స్మార్ట్‌వాచ్‌లో స్టెప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మరియు బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ వంటి ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను పొందుతారు. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.2,999లకే కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ బ్లూటూత్ స్మార్ట్‌వాచ్‌లో ఇది మంచి ఎంపిక.

PA Maxima Max Pro X6: ఈ స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.6,999 విలువైన ఈ స్మార్ట్‌వాచ్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.2,699కి కొనుగోలు చేయవచ్చు. ఇది 1.7 అంగుళాల HD డిస్‌ప్లేతో పాటు 400 నిట్‌ల సూపర్ బ్రైట్ స్క్రీన్ టాప్‌ని కలిగి ఉంది. ఇంతే కాకుండా, ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఫీచర్ల ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Zebronics ZEB-FIT4220CH: Zebronics స్మార్ట్‌వాచ్‌ను కూడా రూ.3,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. SpO2 ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 3.3 సెం.మీ స్క్రీన్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌పై అమెజాన్ 74 శాతం తగ్గింపును అందిస్తోంది. మీరు దీన్ని రూ.7,999కి బదులుగా కేవలం రూ.2,099కి కొనుగోలు చేయవచ్చు.

Amazfit Bip 3: Amazfit స్మార్ట్ వాచ్ రూ. 2,499కి అందుబాటులో ఉంటుంది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. 1.69 అంగుళాల పెద్ద కలర్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌వాచ్‌లో 60 స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ రెసిస్టెన్స్‌తో సహా ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఫీచర్‌లతో స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటే ఈ స్మార్ట్‌వాచ్ మంచి ఎంపిక.





























