మొహమ్మద్ షమిని చూసి మైదానంలోనే ‘జై శ్రీరామ్’ నినాదాలు.. వివాదంపై హిట్ మ్యాన్ ఏమన్నాడంటే..?

నాలుగో మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్ మహ్మద్ షమిని చూసిన కొందరు.. జై శ్రీరామ్ అంటూ అరిచారు. దానికి సంబంధించిన వీడియో..

మొహమ్మద్ షమిని చూసి మైదానంలోనే ‘జై శ్రీరామ్’ నినాదాలు.. వివాదంపై హిట్ మ్యాన్ ఏమన్నాడంటే..?
Jai Sri Ram Chants Before Mohemmad Shami
Follow us

|

Updated on: Mar 13, 2023 | 10:05 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఓ వివాదాస్పద సంఘటన జరిగింది. నాలుగో మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమిని చూసిన కొందరు.. జై శ్రీరామ్ అంటూ అరిచారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. జై శ్రీరామ్ నినాదాలు చేసినవారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆట ముగిసిన తర్వాత టీమ్ అంతా డగౌట్‌లో ఉన్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న కొందరు ఫ్యాన్స్ చీర్ చేశారు. మొదట సూర్యకుమార్‌ను చూసి సూర్య సూర్య అంటూ అరిచారు. ఆ తర్వాత చివర్లో షమి వాళ్లకు కనిపించాడు. దీంతో సడెన్‌గా జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపించాయి. వీటిని షమి పట్టించుకోకపోవడంతో.. షమీ జై శ్రీరామ్ అంటూ అతని పేరు పిలిచి మరీ అరిచారు.

దీంతో ఇది క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నారా లేక.. రథయాత్రనా అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ మ్యాచ్ తొలి రోజు అహ్మదాబాద్ స్టేడియంలోని టికెట్లలో 80 శాతం వరకూ బీజేపీ వాళ్లే కొనుగోలు చేశారని, వాళ్లు తీసుకొచ్చిన అభిమానులే ఇలా అరిచారని మరికొందరు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అసలు ఈ ఘటన జరిగిందన్న విషయం తనకు తెలియనే తెలియదని అన్నాడు. ‘షమిని చూసి జై శ్రీరామ్ అని అరిచారన్న విషయం నాకు అస్సలు తెలియదు. ఇప్పుడే తొలిసారి వింటున్నా. అక్కడ ఏం జరిగిందో తెలియదు’ అని రోహిత్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ఆస్ట్రేలియాతో 4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సోమవారం డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను ఇండియా 2-1తో గెలిచింది. 2017 నుంచి ఆస్ట్రేలియాపై భారత్ ఈ సిరీస్ గెలవడం ఇది వరుసగా నాలుగోసారి. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున శుభమాన్ గిల్(128), విరాట్ కోహ్లీ(186) సెంచరీలు చేశారు. అలాగే ఆసీస్ ఆడిన ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..