Trans Tea Stall: భారత చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక అడుగు వేసిన ట్రాన్స్‌జెండర్లు.. వెల్లువెత్తుతున్న అభినందనలు..

అసోంలోని ట్రాన్స్‌జెండర్ల సంఘం మరో అడుగు ముందుకేసింది. ఆ రాష్ట్ర ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన గువహతి రైల్వే స్టేషన్‌లో..

Trans Tea Stall: భారత చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక అడుగు వేసిన ట్రాన్స్‌జెండర్లు.. వెల్లువెత్తుతున్న అభినందనలు..
Trans Tea Stall
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 13, 2023 | 7:43 PM

సమాజంలోని వివక్షలకు ధీటైన సమాధానం ఇచ్చేలా కొందరు ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికే పలు ఉన్నత స్థానాలను అధిగమించి తామేంటో నిరుపించుకున్నారు. ఈ క్రమంలోనే అసోంలోని ట్రాన్స్‌జెండర్ల సంఘం మరో అడుగు ముందుకేసింది. ఆ రాష్ట్ర ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన గువహతి రైల్వే స్టేషన్‌లో సదరు సంఘం తమ టీ స్టాల్‌ను ప్రారంభించింది. ఇక రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ప్రారంభించిన దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ టీ స్టాల్‌గా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 13) ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘భారత్‌లోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై తొలి ట్రాన్స్ టీ స్టాల్.. గువహతి రైల్వే స్టేషన్’ అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్.. టీ స్టాల్ చిత్రాలను కూడా పోస్ట్ చేశారు.

టీస్టాల్ వివరాల్లోకి వెళ్లే.. ‘ఆల్ అస్సాం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఈ స్టాల్ ప్రారంభించబడింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత 25 డిసెంబర్ 2015న ఈ సంఘం ఏర్పడింది. ఈ సంస్థ సమాజంలోని ట్రాన్స్‌జెండర్ల జీవనోపాధి, హక్కులు, గౌరవం కోసం స్థాపితమై కృషి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, కేంద్ర రైల్వే మంత్రి చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సదరు ట్రాన్స్‌జెండర్ల సంఘం వేసిన అడుగుకు నెటిజన్ల నుంచి తారాస్థాయిలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా పలువురు నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. అద్భుతం’ అంటూ కామెంట్ చేశారు. అలాగే మరో నెటిజన్ ‘గ్రేట్.. సమాజంలో హుందాగా బతికే హక్కు వారికి కూడా ఉంది’ అని రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే న్యాయవాది అశుతోష్ జే దుబే ‘ఈ చారిత్రాత్మక టీ స్టాల్ స్థాపన ప్రారంభోత్సవానికి హృదయపూర్వక అభినందనలు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సమాజంలో సమానత్వం కోసం పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి..!’ అని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.