Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartwatch Offers: స్మార్ట్‌‌వాచ్‌ కొనాలనుకుంటున్నారా..? రూ.2 వేల ధరకే లభిస్తున్న 8 గాడ్జెట్స్.. పూర్తి వివరాలివే..

స్మార్ట్‌వాచ్ కంపెనీలు తమ వినియోగదారుల మన్ననలను పొందేలా. కాల్ ఫంక్షన్‌, ECG ట్రాకర్‌తో కూడిన పలు ఫీచర్లను స్మార్ట్ వాచ్‌లలో అందిస్తున్నాయి. అలాంటి స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు

Smartwatch Offers: స్మార్ట్‌‌వాచ్‌ కొనాలనుకుంటున్నారా..? రూ.2 వేల ధరకే లభిస్తున్న 8 గాడ్జెట్స్.. పూర్తి వివరాలివే..
Smartwatches
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 13, 2023 | 6:40 PM

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌‌వాచ్‌లు స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారాయి.  ఆ కారణంగానే పలు స్మార్ట్‌వాచ్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఇంకా రూ.2 వేల నుంచి రూ. 5 వేల ధరకే బెస్ట్ స్మార్ట్‌వాచ్లను తమ వినియోగదారులకు పరిచయం చేస్తున్నాయి. ఇంకా తన వినియోగదారుల మన్ననలను పొందేలా. కాల్ ఫంక్షన్‌, ECG ట్రాకర్‌తో కూడిన పలు ఫీచర్లను స్మార్ట్ వాచ్‌లలో అందిస్తున్నాయి. అలాంటి స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు 8 ఉన్నాయి. విశేషమేమంటే వాటి ధర 2 వేలలోపే ఉంది. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్(boAt Wave Call Smart Watch): బోట్ నుంచి బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇది. 550 NITS,  1.69-అంగుళాల పూర్తి HD టచ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇతర స్మార్ట్‌ వాచ్‌ల మాదిరిగా కాకుండా, ఇది ఇంటర్నల్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది వినియోగదారులు జర్నీలో ఉండగా కాల్స్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 2 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇందులో హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, Sp2O ట్రాకర్ కూడా ఉన్నాయి. వినియోగదారులు రన్నింగ్, సైక్లింగ్, క్లైంబింగ్, యోగా బ్యాడ్మింటన్ వంటి అనేక స్పోర్ట్స్ మోడ్‌ల నుండి ఎంచుకోవచ్చు.

ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో స్మార్ట్‌ వాచ్(Fire-Boltt Phoenix Smart Watch): ఈ స్మార్ట్ వాచ్ అంతర్నిర్మిత స్పీకర్, మైక్రోఫోన్‌ తో కాల్స్ ను రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 1.39-అంగుళాల TFT టచ్ స్క్రీన్,  240 X 240 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో డిస్ ప్లేను కలిగి ఉంటుంది.  ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో గట్టి బాడీని కలిగి ఉంటుంది. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.  ఈ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంది.  ఇది మీ ఫోన్‌లో సిరి/గూగుల్‌ని ఒక్క ట్యాప్‌తో యూజ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

TAGG వెర్వ్ NEO స్మార్ట్‌ వాచ్: 500 NITS  బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. మహిళలకు సంబంధించిన ఋతు చక్రాన్ని కూడా ట్రాక్ చేస్తోంది. ఇది మీ వ్యాయామాలు, రోజు వారీ కార్యాచరణను ట్రాక్ చేస్తోంది. మీ నిద్ర నాణ్యతను కూడా ట్రాక్ చేస్తోంది.

నాయిస్ కలర్‌ ఫిట్ పల్స్ స్మార్ట్‌ వాచ్( Noise ColorFit Pulse Smart Watch): నాయిస్ కలర్‌ ఫిట్ పల్స్ వాచ్ 1.4-అంగుళాల ఫుల్-టచ్ HD డిస్‌ ప్లే, 10 రోజుల బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ వాచ్ Android, iOS ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది వినియోగదారుల సాధారణ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించే సెన్సార్లతో వస్తుంది.  స్పోర్ట్స్ మోడ్‌లలో కేలరీలను ట్రాక్ చేస్తుంది. అవుట్‌డోర్ అడ్వెంచర్‌లకు అనుకూలంగా ఉంటుంది.

Zebronics Zeb-FIT3220CH స్మార్ట్ ఫిట్‌ నెస్ వాచ్: ఈ స్మార్ట్ వాచ్ 1.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫిట్‌ నెస్-ఫోకస్డ్ స్మార్ట్‌ వాచ్. ఇది బీపీని, హార్ట్ బీట్ ను పర్యవేక్షిస్తుంది. ఇది సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు గురించి  తెలియజేస్తుంది. ఇది స్టైలిష్, సొగసైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ వాచ్ వాటర్ రిసిస్టెంట్ గా పని చేస్తోంది.

ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ బీట్+  స్మార్ట్‌ వాచ్(Reflex Beat Black Smart Band): ఇది 1.6 అట్రా యూవీ డిస్ ప్లే తో వస్తుంది.   స్మార్ట్‌ వాచ్‌లో మొత్తం 60 కొత్త ఇన్ బిల్ట్ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇందులో హెల్త్ ట్రాకర్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి.

PTron Force X12N స్మార్ట్‌ వాచ్: ఈ స్మార్ట్ వాచ్‌లో 5 గేమ్‌లు, స్మార్ట్ హెల్త్/ఫిట్‌నెస్ ట్రాకర్, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలారం, స్టెప్ కౌంట్, బర్న్ చేయబడిన కేలరీలతో పాటు 8 స్పోర్ట్ మోడ్‌లు ఉన్నాయి. ఇది వాయిస్ డిటెక్షన్,  అలారం క్లాక్  కలిగి ఉంది.  అంతర్నిర్మిత మైక్రోఫోన్,స్పీకర్, బ్లూటూత్ కలిగి ఉంటుంది.

హామర్ పల్స్ ఏస్ ప్రో స్మార్ట్‌ వాచ్(Hammer Pulse Ace Pro Bluetooth Calling Smartwatch): ఈ స్మార్ట్ వాచ్ 240 x 286 బ్రైట్ నెస్ రిజల్యూషన్‌తో 1.81-అంగుళాల డిస్‌ ప్లేను కలిగి ఉంది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అల్యూమినియం అల్లాయ్ బాడీని కలిగి ఉంది. బెస్ట్ కాలింగ్ అనుభవం కోసం మైక్రోఫోన్, స్పీకర్‌తో అమర్చబ ఉంది.   శక్తివంతమైన బ్యాటరీ స్టాండ్‌బైలో 7 రోజులు ఉంటుంది.  M2 Wear యాప్‌తో Android, iOS ఫోన్‌లతో పని చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..