Breast Cancer: రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, రకాలు ఇవే.. మీలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి..

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు బాధితులందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. వివిధ వ్యక్తుల్లో వివిధ రకాల లక్షణాలు బయట పడవచ్చు. అత్యంత సాధారణ లక్షణం.. బాధితులకు

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, రకాలు ఇవే.. మీలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి..
Breast Cancer
Follow us

|

Updated on: Mar 12, 2023 | 10:02 PM

ఇటీవలి కాలంలో మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు తర్వాత క్యాన్సర్‌దే రెండో స్థానం. అయితే ఈ క్యాన్సర్‌ను  లేదా దాని లక్షణాలను ముందుగానే గుర్తించి తగు నివారణ చర్యలు, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఈ క్యాన్సర్‌లో దాదాపు 60 రకాల వరకు ఉన్నాయి. వాటిలో ఎక్కువ మందిని వెంటాడుతున్న రకంలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. ఈ వ్యాధి కూడా ముందుగానే గుర్తించడం ద్వారా నివారించవచ్చు. అయితే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు బాధితులందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. వివిధ వ్యక్తుల్లో వివిధ రకాల లక్షణాలు బయట పడవచ్చు. అత్యంత సాధారణ లక్షణం.. బాధితుల రొమ్ము లేదా చంకలో గడ్డ లాంటి ముద్ద ఏర్పడటం. చర్మంలో మార్పులు, రొమ్ములో నొప్పి, చనుమొన లోపలికి వెళ్లడం, చనుమొన నుంచి అసాధారణమైన ద్రవాలు కారడం వంటివి మరికొన్ని సాధారణ లక్షణాలు.

రొమ్ము క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు

  • బాధితుల రొమ్ము లేదా చంకలో ఏర్పడే గడ్డ పూర్తిగా నయం కాదు. ఇది రొమ్ము క్యాన్సర్ మొదటి లక్షణం. ఈ గడ్డను బాధితులు గుర్తించడానికి ముందే వైద్యులు మామోగ్రామ్‌లో వీటిని గుర్తించవచ్చు.
  • బాధితుల చంకలో లేదా కాలర్‌బోన్ దగ్గర వాపు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఆ ప్రాంతంలోని శోషరస గ్రంథులకు వ్యాపించిందని దీని అర్థం. గడ్డ ఏర్పడటానికి ముందే ఈ వాపు ప్రారంభం కావచ్చు. కాబట్టి రొమ్ము, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాపు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
  • సాధారణంగా ఈ గడ్డలు బాధించనప్పటికీ కొన్నిసార్లు నొప్పి, అసౌకర్యం వంటివి కలుగుతాయి.
  • రొమ్ముపై ఏదైనా ప్రాంతంలో చర్మం సొట్టబడినట్లు కనిపించడం మరో లక్షణం. కంటికి కనిపించని లేదా అనుభూతి చెందని కణితి కారణంగా ఇలా జరగవచ్చు.
  • రొమ్ము పరిమాణం, ఆకృతి, ఉష్ణోగ్రతలో తేడా, రొమ్ములో మార్పులు, రొమ్ము కిందిభాగం రంగు మారడం కూడా వ్యాధికి లక్షణాలు.
  • చనుమొనలో కనిపించే కొన్ని మార్పులు.. అంటే చనుమొన రొమ్ము లోపలికి వెళ్లడం, ఆ ప్రాంతం సొట్టబడినట్లు కనిపించడం, మంట, దురద, అక్కడ పుండ్లు ఏర్పడటం, చనుమొన రంగు మారడం, లేదా అసాధారణ ద్రవాలు కారడం వంటివన్నీ రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు.

రొమ్ము క్యాన్సర్ రకాలు:

  •  డక్టల్ కార్సినోమా: డక్టల్ కార్సినోమా అనేది పాల నాళాల లైనింగ్‌లో ఏర్పడే క్యాన్సర్. ఇది రొమ్ము క్యాన్సర్‌లో అత్యంత సాధారణ రకం.
  • లోబ్యులర్ కార్సినోమా: లోబ్యులర్ కార్సినోమా అనేది రొమ్ము లోబుల్స్‌లో క్యాన్సర్. లోబుల్స్ అంటే పాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశం.
  • సార్కోమా: ఇది రొమ్ము బంధన కణజాలంలో మొదలయ్యే క్యాన్సర్.
  • ఆంజియోసార్కోమా: ఈ రకం రక్త నాళాలు లేదా శోషరస నాళాలను లైన్ చేసే కణాలలో మొదలవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి