Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exam Diet: పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి వీటిని తప్పకుండా తినాల్సిందే

పరీక్షల్లో విజయం సాధించాలంటే శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అదే సమయంలో మానసికంగానూ ఎంతో హెల్దీగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.

Exam Diet: పరీక్షలకు ప్రిపేరవుతున్నారా? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి వీటిని తప్పకుండా తినాల్సిందే
Exam Food
Follow us
Basha Shek

|

Updated on: Mar 12, 2023 | 8:44 PM

పరీక్షల్లో విజయం సాధించాలంటే శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అదే సమయంలో మానసికంగానూ ఎంతో హెల్దీగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. పరీక్షల సమయంలో క్రమం తప్పకుండా  ఆరోగ్యకరమైన భోజనం, స్నాక్స్ తినడం వల్ల పిల్లలు మరింత ఏకాగ్రతతో చదువుకుంటారు. ముఖ్యంగా అల్పాహారం రోజంతటిని ప్రభావితం చేస్తుంది. అల్పాహారం మానేయడం శరీరానికి హానికరం. ఎక్కువ కాలం ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది మీ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతంది. ఇక పరీక్షల ఒత్తిడి చాలామందిపై ఉంటుంది. అందుకే పరీక్షకు ముందు కడుపు నిండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల మెదడు సమర్థవంతంగా పని చేయడానికి అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి పోషకాలున్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అలాగే కొన్ని ఫుడ్స్‌ను దూరంగా పెట్టాలి. అవేంటో తెలుసుకుందాం రండి.

హెల్దీఫుడ్స్

  • మీ పిల్లలు హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోండి. డీహైడ్రేషన్‌ కండరాల అలసటను కలిగిస్తుంది. పరీక్ష రాయడానికి ఆటంకం కలిగిస్తుంది.
  • పిల్లలు తేలికగా జీర్ణం కావడానికి చాలాసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం మంచిది.
  • మీ పిల్లల ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి
  • చక్కెర, ఉప్పును నివారించండి ఎందుకంటే ఇవి బరువు పెరుగుటకు దారితీస్తాయి.
  • పిజ్జా, బర్గర్లు, వడ పావ్, సమోసాలు వంటి వీధి స్నాక్స్, చిప్స్, చాక్లెట్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
  • కెఫిన్ మానుకోండి. ఎరేటెడ్ డ్రింక్స్ (ఫిజీ డ్రింక్స్) , ఫ్రూట్ జ్యూస్ (పండ్ల రసం) మానుకోండి. బదులుగా తాజా పండ్లను తినడం మంచిది.
  • అజీర్ణం, ఉబ్బరం నిరోధించడానికి అధిక ఫైబర్ ఆహారాలు తినండి
  • అరటిపండు మంచి శక్తి వనరు. శరీరానికి పూర్తి పోషకాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, మానసిక గందరగోళాన్ని నివారించడానికి అరటిపండ్లను పరీక్షల ముందు తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..