Pumpkin Seeds: గుమ్మడి గింజలతో 6 అద్భుత ప్రయోజనాలు.. అవేమిటో చూద్దాం రండి..

పచ్చి గుమ్మడికాయను కూర చేయడానికి, సాంబరులో ఉపయోగిస్తారు. అయితే అది ఎండిపోయిన తర్వాత మిగిలి ఉండే గుమ్మడి గింజలతో కూడా ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే..

Pumpkin Seeds: గుమ్మడి గింజలతో 6 అద్భుత ప్రయోజనాలు.. అవేమిటో చూద్దాం రండి..
Pumpkin Seeds
Follow us

|

Updated on: Mar 12, 2023 | 6:45 PM

Pumpkin Seeds: ఆరోగ్యాన్ని కాపాడడంలో కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, డ్రైనట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మీకు గుమ్మడి గింజలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా..? అవును పచ్చి గుమ్మడికాయను కూర చేయడానికి, సాంబరులో ఉపయోగిస్తారు. అయితే అది ఎండిపోయిన తర్వాత మిగిలి ఉండే గుమ్మడి గింజలతో కూడా ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే.. గుమ్మడి గింజలలో విటమిన్ ఎ, సి, ఈ, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మన శరీరానికి పోషకాల కొరత ఉండదు.  ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా గుమ్మడి గింజలలోని విటమిన్ సీ మన శరీర వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడేలా చేస్తుంది. ఈ క్రమంలో మీరు గుమ్మడి గింజలను నీటిలో నానబెట్టడం, మొలకెత్తిన తర్వాత తినడం, సలాడ్‌లు, సూప్‌లుగా కూడా కలుపుకొని తినవచ్చు. కావాలంటే ఎండబెట్టి పొడి చేసి తీసుకోవచ్చు. మరి ఈ గుమ్మడికాయ గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి: కాలనుగుణంగా వ్యాపించే ఆరోగ్య సమస్యలను నిరోధించడంలో, నివారించడంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో గుమ్మడికాయ గింజలు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇంకా శరీరానికి కావలసిన పోషకాలను అందించి.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్స్ ఈ రక్తనాళాలను కూడా బలపరుస్తుంది.

గుండెజబ్బులకు చెక్: రోజూ ఒక చెంచా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మీ చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా చేస్తే గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు అదుపులో ఉంటాయి. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎముకలకు మేలు: గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల.. వీటిని తింటే ఎముకలు దృఢంగా ఉండి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థ: ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని అన్ని రోగాలకు మూలం పొట్ట. కానీ గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల కడుపుకు చాలా మంచిదిగా భావిస్తారు ఆయుర్వేద నిపుణులు. అవి మన జీర్ణవ్యవస్థను సరిచేయడానికి పని చేస్తాయి. అందువల్ల వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

కళ్లకు మేలు: గుమ్మడికాయ గింజలలో విటమిన్ ఎ, ఈ  ఉండడం వల్ల ఇవి కళ్ళకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇవి కళ్లను రక్షించబడడమే కాక కంటిచూపు మెరుగవుతుంది.

కీళ్ల నొప్పులు: గుమ్మడికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల కీళ్లనొప్పులు కూడా దూరమవుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..