Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ 5 జ్యూస్‌లు తాగితే నెల రోజుల్లో నాజూకైన నడుము మీ సొంతం..

బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. కొంత కాలం గడిచిన తర్వాత కూడా అవేమీ పనిచేయక పోవడంతో ప్రయత్నాలు..

Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ 5 జ్యూస్‌లు తాగితే నెల రోజుల్లో నాజూకైన నడుము మీ సొంతం..
Weight Lose Juices
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 11, 2023 | 12:25 PM

ప్రస్తుత కాలంలో సమాజంలోని కొందరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే పరిమితికి మించి ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, జీవన శైలి మార్పులే ఇందుకు ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. లావుగా లేదా బరువు ఎక్కువ ఉన్నవారు తరచూగా ఆరోగ్య సమస్యల బారిన పడడమనేది సర్వసాధారణమని వారు అంటున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి లోపించడం ద్వారా ఇలా జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఇంకా లావుగా ఉన్నవారిలోనే హార్ట్ ఎటాక్, డయాబెటీస్, బీపీ, ఆస్తమా వంటి పలు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు వివరించారు. అందువల్ల సాధ్యమైనంత వరకు మీ శరీరానికి, వయసుకు తగిన విధంగా బరువు తక్కువగా ఉండడమే మేలని హెచ్చరిస్తున్నారు.

అయితే బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. కొంత కాలం గడిచిన తర్వాత కూడా అవేమీ పనిచేయక పోవడంతో ప్రయత్నించడం కూడా మానేస్తారు. అలాంటివారు కొన్ని రకాల జ్యూస్లను తాగడం వలన కొద్ది రోజుల్లో సన్నబడతారాని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని పోషకాలు శరీరం బరువు తగ్గేందుకు ప్రేరేపిస్తాయని.. అందువల్ల ఈ జ్యూస్ తాగితే చాలాని చెబుతున్నారు. మరి బరువు తగ్గేందుకు మనకు ఉపయోగపడే జ్యూస్‌లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పుచ్చకాయ జ్యూస్: పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో తినాలనే కోరిక తగ్గి తొందరగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు ఉదయాన్నే పుచ్చకాయ జ్యూస్ ను త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కరివేపాకు జ్యూస్: కరివేపాకు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నిత్యం మనం తినే ఆహారంలో వాడుతూ ఉంటాం. అయితే కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్టుగా జ్యూస్ చేసుకుని తాగితే తొందరగా బరువు తగ్గుతారు. దీనికోసం గుప్పెడు కరివేపాకు గ్లాసు నీళ్లలో వేసి మరిగించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపి త్రాగడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఉండే అమైనా ఆమ్లాలు పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

బొప్పాయి జ్యూస్: ప్రతిరోజు ఉదయం టిఫిన్ కి బదులుగా బొప్పాయి జ్యూస్ తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. బొప్పాయి లో ఉండే ఫైబర్ పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గోధుమ గడ్డి జ్యూస్: ప్రతిరోజు ఉదయాన్నే కాఫీకి బదులుగా గోధుమ గడ్డి జ్యూస్ త్రాగితే తొందరగా సన్నబడవచ్చు. గోధుమ గడ్డిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. దీనిని తరచూ తీసుకోవడం వలన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోయి త్వరగా సన్నబడతారు.

బీట్రూట్-క్యారెట్ జ్యూస్: ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్, రెండు క్యారెట్లు కలిపి జ్యూస్ లా తయారు చేసుకుని త్రాగాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఫైబర్ అధిక బరువును తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..