AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 5 లక్షణాలు ఉంటే చాలు.. విజయం మీ బానిస అవుతుంది..

సక్సెస్‌ను ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచిస్తుంటారు. ఆ ప్రకారమే సంతృప్తి చెందుతారు. అయితే జీవితంలో మనిషి ఎలా బతకాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో, ఏయే అంశాలకు

Chanakya Niti: ఈ 5 లక్షణాలు ఉంటే చాలు.. విజయం మీ బానిస అవుతుంది..
Chanakya Neeti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 11, 2023 | 10:29 AM

Share

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సక్సెస్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటిలో కొందరు మాత్రమే సఫలం అవుతుంటారు. ఇక సక్సెస్‌ను ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచిస్తుంటారు. ఆ ప్రకారమే సంతృప్తి చెందుతారు. అయితే జీవితంలో మనిషి ఎలా బతకాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో, ఏయే అంశాలకు దూరంగా ఉండాలో చాణక్యుడు తాను రచించిన నీతి శాస్త్రంలో వివరించారు. వాటిని పాటించడం వల్ల అనేక వివాదాలు, ఆర్థిక నష్టాలను నివారించడానికి అవకాశం ఉంది. మరి జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఆ నీతి గ్రంథంలో చాణక్యుడు చెప్పిన విషయాల్లో కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బలం,బలహీనతలను రహస్యంగా ఉంచడం: జీవితంలో సక్సెస్ సాధించాలంటే ముందుగా మన రహస్యాలను ఇతరులకు చెప్పకపోవడం మంచిదని చాణక్య బోధించారు. ఒకవేళ బహిర్గతం చేస్తే, ఇతరులు వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బలం, బలహీనతల గురించి ఎవరితోనూ పంచుకోకూడదని నొక్కి చెప్పారు. అలా చేయడం వల్ల మీ బలహీనతలను ఇతరులు క్యాష్ చేసుకోలేరని, అలాగే బలాలను ఎదుర్కొవడానికి సరైన స్ట్రాటజీ రూపొందించడానికి అవకాశం ఉండదని చాణక్యుడు వివరించారు.

విద్య: చాణక్యుడు విద్యకు ఉన్న ప్రాధాన్యతను తన నీతి గ్రంథంలో ఎంతగానో కీర్తించారు. చదువుకున్న వ్యక్తికి ఎక్కడికి వెళ్లినా గౌరవం ఉంటుందని.. జీవితంలో సక్సెస్ పొందడంలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి శారీరకంగా బలహీనంగా ఉన్నా, తగిన రూపం లేకున్నా, తగినంత సంపద లేకున్నా, విద్య ఉంటే జీవితం సుఖమయంగా సాగుతుందని చాణక్యుడు వివరించారు. ధనవంతుడి సంపద, బలంగం, అందం అనేవి కాలక్రమేణా మసకబారవచ్చు. అదే విద్య, జ్ఞానం అనేవి ఓ వ్యక్తిని ఏ స్థితిలోనూ వదిలిపెట్టవు.

ఇవి కూడా చదవండి

పనికి ముందు తర్కించడం: ఎవరైన తమ జీవితంలో సక్సెస్ సాధించాలంటే పనిచేయడం, కష్టించడం కీలకమని చాణక్యుడు చెప్పారు. అయితే పని చేసే ముందు ఈ మూడు ప్రశ్నలను గుర్తించుకోవాలని సూచించారు. పని చేయడానికి ప్రేరణ లేదా కారణం ఏమిటి..? ఫలితాలు ఎలా ఉండవచ్చు..? సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందా..? అనే విషయాలను లోతుగా ఆలోచించి సంతృప్తికరమైన సమాధానం వచ్చిన తరువాతనే పనిని కొనసాగించాలని నీతి గ్రంథంలో చాణక్యుడు రాశారు.

ప్రేమ, దయ గుణాలను కలిగి ఉండడం: పువ్వు సువాసన అనేది గాలి దిశలో మాత్రమే వ్యాపిస్తుంది. అయితే ఒక వ్యక్తికి చెందిన మంచితనం అన్ని దిశలలో వ్యాపిస్తుందని చాణక్యుడు చెప్పారు. ఒక వ్యక్తి వారి సంస్కృతి లేదా సంఘంతో సంబంధం లేకుండా ఇతరులతో ఎల్లప్పుడూ దయతో ఉన్నప్పుడే జీవితంలో ఏ విషయంలోనైనా విజయం సాధించగలరని చాణక్యుడు నీతి గ్రంథంలో వివరించారు.

తప్పుల నుంచి నేర్చుకోవడం: ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేయడం సహజం. అయితే వాటిని మళ్లీ చేయనివారే జీవితంలో సక్సెస్ అవుతారని చాణక్యుడు సూచించారు. మనిషి జీవితకాలం చాలా తక్కువని, పదే పదే తప్పులు చేసేవారు సక్సెస్ సాధించలేరని చెప్పాడు. చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులు, పరిస్థితులను నిశితంగా గమనిస్తూ వాటి నుంచి తగిన పాఠం నేర్చుకుంటేనే సక్సెస్ మీ సొంతం అవుతుందని బోధించారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)