Health Risk: ఈ సమస్యలున్నాయా..? అయితే అరటి పండ్లకు దూరంగా ఉండండి.. ఎందుకంటే..?

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదని, తింటే హాని కలిగిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా అరటి పండ్లతో..

Health Risk: ఈ సమస్యలున్నాయా..? అయితే అరటి పండ్లకు దూరంగా ఉండండి.. ఎందుకంటే..?
Banana Health Risk
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 10, 2023 | 8:00 PM

అరటి పండ్లు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవని మనందరికీ తెలిసిందే. అరటి పండులోని పోషకాలు మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అరటిపండులో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, చక్కెర, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. దీనిలో ఉండే పోషకాల  కారణంగానే దీనిని సూపర్‌ఫుడ్‌గా కూడా పిలుస్తారు. అయితే కొంతమంది లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అరటి పండ్లను తినకూడదని, తింటే హాని కలిగిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా అరటి పండ్లతో ఎలర్జీ సమస్యలు ఉండేవాళ్లు పొరపాటున కూడా దీనిని తీసుకోకూడదు. ఇలాంటి వారు అరటి పండ్లను తినడం వల్ల స్వెల్లింగ్, శ్వాస ఇబ్బంది, ఎనాఫిలెక్సిస్ వంటి తీవ్ర లక్షణాలు ఉత్పన్నమవుతాయి. ఇంకా ఏయే సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం: అరటి పండ్లలో నేచరల్ షుగర్ ఉన్న కారణంగా మధుమేహం లేదా బ్లడ్ షుగర్ సమస్యలతో బాధపడుతున్న రోగులు పొరపాటున కూడా వీటిని తినకూడదు. ఒకవేళ తినాల్సి వస్తే బాగా పండినవి అస్సలు తినకూడదు.

కిడ్నీ: అరటి పండ్లలో పొటాషియం అధిక మోతాదులో ఉన్నందును.. కిడ్నీ సమస్య ఉన్న వ్యక్తులకు హానికారకం. శరీరంలో అదనంగా ఉన్న పొటాషియం బయటకు తొలగించడంలో సమస్య వస్తుంది. అందుకే కిడ్నీ సమస్యలున్నవాళ్లు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మలబద్ధకం: కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు అరటి పండ్లు తినకూడదు. ఎందుకంటే అరటి పండ్లు మలబద్ధకం సమస్యను తగ్గించాల్సింది పోయి..పెంచుతుంది.

ఆస్తమా: ఆస్తమా రోగులకు కూడా అరటి పండ్లు మంచివి కావు. వీరు అరటి పండ్లను తినడం వల్ల సమస్య మరింతగా పెరిగిపోతుంది. అందుకే ఆస్తమా రోగులు అరటి పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి