AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ‘పగవాడికి కూడా రాని కష్టం ఇది’.. నెటిజన్లకు చెప్పి ఏడుస్తున్న చిన్నారి.. అసలు విషయం ఏమిటంటే..?

ఓ చిన్నారికి వచ్చిన కష్టాన్ని చూసి నెటిజన్లు ఏం చేయాలో తెలియక తికమకపడిపోతున్నారు కూడా. అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే..

Funny Video: ‘పగవాడికి కూడా రాని కష్టం ఇది’.. నెటిజన్లకు చెప్పి ఏడుస్తున్న చిన్నారి.. అసలు విషయం ఏమిటంటే..?
Girl Crying For Hair Combing Herself
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 10, 2023 | 8:05 PM

Share

అందరికీ అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాలో.. అందరిలో ఫేమస్ కావాలని చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో చిన్నాపెద్దా అని మినహాయింపు లేనే లేదు. ఆరేళ్ల పిల్లవాడి నుంచి మొదలుకొని ఆరవై ఏళ్ళ వయసున్నవారి వరకు అందరిదీ ఇదే తరహా అలోచన. ఈ క్రమంలోనే ఓ చిన్నారి చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నారికి వచ్చిన కష్టాన్ని చూసి నెటిజన్లు ఏం చేయాలో తెలియక తికమకపడిపోతున్నారు కూడా. అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే ఆ చిన్నారి ఓ దువ్వెనతో తన జుట్టును దువ్వుకుంటుంది. అంతేనా..? అయితే జుట్టును దువ్వుతున్న క్రమంలో వెంట్రుకలకు చిక్కుపడిపోయిందని ఆ చిన్నారి ఏడుస్తూ తన గోడును నెటిజన్లకు షేర్ చేసుకుంది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

blackie_memeash అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఆ చిన్నారి తలలో దువ్వెన చిక్కుపడి ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇంకా అందుకు ఆమె ‘మిత్రులారా.. చూడండి నా వెంట్రుకలలో దువ్వెన చిక్కుకుపోయింది. చాలా నొప్పిగా ఉంది’ అంటూ తన కష్టాన్ని నెటిజన్లతో విన్నవించుకుని ఏడుస్తోంది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆ చిన్నారి కష్టంపై ఎలా స్పందించాలో కూడా తెలియక అయోమయ స్థితిలో ఉన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ‘Tag your bestie ??’ అనే క్యాప్షన్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 72 లక్షల వీక్షణలు.. అలాగే 3వ లక్షల 80 వేలకు పైగా లైకులు వచ్చాయి. మరో వైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు వింత వింత కామెంట్లతో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘అమ్మ దగ్గరకు వెళ్లు. ఒక్కటి కొట్టగానే అంతా సరైపోతుంది’ అని రాసుకువచ్చారు. మరో నెటిజన్ ‘ఒకప్పుడు నాకు కూడా అలాంటి కష్టం వచ్చి పడింది. అయితే నిదానంగా ఆ సమస్య నుంచి బయటపడ్డాను’ అని కామెంట్ చేశారు. ఇదే తరహాలో ఇంకో నెటిజన్ అయితే ‘పగవాడికి కూడా రాని కష్టం ఇది. ఆ చిన్నారికి చాలా నొప్పిగా ఉంది మిత్రులారా.. వెంటనే వీడియోను లైక్ చేసి, ఆమెను ఫాల్లో అవ్వండి’ అని కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..