AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బాలాపూర్‌లో పరువు హత్య.. మతాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిని హతమార్చిన యువతి బంధువులు..

మతాంతర ప్రేమ చేసుకున్న యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్..

Hyderabad: బాలాపూర్‌లో పరువు హత్య.. మతాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిని హతమార్చిన యువతి బంధువులు..
attack
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 09, 2023 | 9:14 PM

Share

హైదరాబాద్‌ నగరం మరో పరువు హత్యకు సాక్ష్యంగా నిలిచింది. మతాంతర ప్రేమ చేసుకున్న యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేస్లీతండాకు చెందిన డెగావత్ ఫూల్‌సింగ్ తన భార్య, కుమారుడు పవన్(18),ఇద్దరు కుమార్తెలతో కలిసి బతుకుదెరువు కోసం నగరశివారు ప్రాంతంలోని బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలోని షాహీన్‌నగర్ వాదే హి ఒమర్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పవన్‌కు స్థానికంగానే నివాసం ఉంటున్న ఓ యువతితో ఏడాది కాలంగా ప్రేమవ్యవహారం కొనసాగుతుంది.

అయితే ఈ విషయంపై పవన్, యువతి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో ఈనెల 8వ తేది సాయంత్రం పవన్ కుటుంబ సభ్యులు, యువతి బుందువుల మధ్యలో డబ్బుల సెటిల్‌మెంట్‌కు సంబంధించి గొడవలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి సుమారు 11:40 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు పవన్. అయితే అప్పటికే అతని ఇంటి వద్ద మాటువేసిన యువతి బాబాయ్.. మరో వ్యక్తితో కలిసి కత్తులతో విచక్షనారహితంగా దాడిచేసి గాయపర్చడంతో భయభ్రాంతులకు గురైన పవన్ ఇంట్లోకి పరుగులు తీశాడు. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి పవన్‌ను తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతిచెందాడని వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఇన్స్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..