AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో ఫ్రీగా నటన.. 18 ఏళ్లైనా ఆగని కాసుల వర్షం.. ‘స్లమ్‌డాగ్’తో అనిల్ కపూర్ ఖాతాలోకి ఇప్పటికీ లక్షలు!

ఇటీవల ఓ కాన్‌క్లేవ్ లో పాల్గొన్న అనిల్ కపూర్, తన కెరీర్‌లోని అత్యంత భావోద్వేగపూరితమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ ఆ సినిమా టీమ్ నుంచి తనకు పేమెంట్స్ వస్తున్నాయని తెలిపారు. ఒక సినిమా నటుడికి దశాబ్దాల తర్వాత కూడా ఆదాయం తెచ్చిపెట్టడం అనేది భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా జరిగే విషయం.

అప్పట్లో ఫ్రీగా నటన.. 18 ఏళ్లైనా ఆగని కాసుల వర్షం.. ‘స్లమ్‌డాగ్’తో అనిల్ కపూర్ ఖాతాలోకి ఇప్పటికీ లక్షలు!
Anil Kapoorr
Nikhil
|

Updated on: Mar 17, 2026 | 6:00 AM

Share

సినిమా విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. కానీ, ఆ చిత్రం ఇప్పటికీ ఆయన బ్యాంకు ఖాతాలోకి లక్షల రూపాయలను తెచ్చిపోస్తోంది. ఒక హాలీవుడ్ సినిమా భారతీయ నటుడిని ఎలా నిజమైన మిలియనీర్‌ను చేసిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన ఏజ్‌లెస్ లుక్స్‌తో, ఎనర్జీతో నేటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న ఆ సీనియర్ స్టార్.. అనిల్ కపూర్. 2008లో వచ్చిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో తాజాగా జరిగిన ఒక సదస్సులో ఆయన స్వయంగా వెల్లడించారు.

మిలియనీర్‌ను చేసిన ‘స్లమ్‌డాగ్’

“నేను ఈ విషయం మీతో పంచుకోవాలి.. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నిన్ననే నాకు ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ టీమ్ నుంచి మళ్ళీ ఒక పే చెక్ వచ్చింది” అని అనిల్ కపూర్ వెల్లడించారు. ఎంత మొత్తం వచ్చిందని అడగ్గా.. “నిన్న 3,000 పౌండ్లు (సుమారు 3.3 లక్షల రూపాయలు) వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా ద్వారా నేను దాదాపు అర మిలియన్ పౌండ్లు (సుమారు 5.5 కోట్ల రూపాయలు) సంపాదించాను. అందుకే నేను నిజంగానే మిలియనీర్‌ను అయ్యాను” అని సంతోషం వ్యక్తం చేశారు. విచిత్రం ఏంటంటే, ఈ సినిమా మొదలయ్యేటప్పుడు బడ్జెట్ తక్కువగా ఉండటంతో ఆయన ఉచితంగానే నటించడానికి సిద్ధపడ్డారట.

నిజానికి అనిల్ కపూర్ కేవలం డబ్బు కోసం ఈ సినిమా చేయలేదు. హాలీవుడ్ మేకింగ్ ఎలా ఉంటుంది? డానీ బోయల్ వంటి గొప్ప దర్శకుడి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, తనను తాను ఎడ్యుకేట్ చేసుకోవడానికే ఆ ప్రాజెక్టులో భాగమయ్యారట. నేటికీ తను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం నిరంతరం నేర్చుకోవాలనే తపనే అని ఆయన చెప్పుకొచ్చారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలో ఆయన క్విజ్ మాస్టర్ ప్రేమ్ కుమార్ పాత్రలో అద్భుతంగా నటించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.

Sdm

Sdm

69 ఏళ్ల వయసులోనూ అనిల్ కపూర్ కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇటీవల ఆయన నటించిన యాక్షన్ డ్రామా ‘సుబేదార్’ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. త్వరలోనే ఆయన ‘ఆల్ఫా’ అనే భారీ బడ్జెట్ సినిమాలో కనిపించబోతున్నారు. శివ్ రావైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, శర్వరీ వాఘ్ మరియు బాబీ దేఓల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రంగంలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైతే అనిల్ కపూర్ లాగా దశాబ్దాల పాటు ఆదాయం, కీర్తి రెండూ దక్కుతాయి. తన అద్భుతమైన నటనతో ప్రపంచాన్ని మెప్పించిన అనిల్ కపూర్, రాబోయే సినిమాలతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం