Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ప్రేమలో పడితే పిచ్చోళ్లు అయిపోతారా..? ఈ వీడియో చూస్తే నిజమేనేమో అనుకుంటారు.. మీరే చూడండి..

ప్రేమలో పడితే రేయిపగలు, ఆకలిదప్పికలు, సమయం తెలియదని చెబుతుంటారు. అవి మాత్రమే కాదు.. ఊరికి, పొలానికి కూడా తేడా తెలియదని, పిచ్చి పీక్స్‌కు వెళ్తుందని కూడా నిరూపించేలా..

Funny Video: ప్రేమలో పడితే పిచ్చోళ్లు అయిపోతారా..? ఈ వీడియో చూస్తే నిజమేనేమో అనుకుంటారు.. మీరే చూడండి..
Boy Being On Phone Call
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 10, 2023 | 3:48 PM

‘ప్రేమ గుడ్డిది, పిచ్చిది’ అని మీరు ఇది వరకే విని ఉంటారు. ఆ మాటలు నిజమే అనుకునేలా ప్రవర్తిస్తుంటారు కొందరు ప్రేమికులు. ఇంకా ప్రేమలో పడితే రేయిపగలు, ఆకలిదప్పికలు, సమయం తెలియదని చెబుతుంటారు. అవే కాదు.. ఊరికి, పొలానికి కూడా తేడా తెలియదని, పిచ్చి పీక్స్‌కు వెళ్తుందని నిరూపించేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అవును. ప్రస్తుతం నెట్టింట ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక యువకుడు తన ప్రియురాలితో మాట్లాడడం కోసం ఎవరూ ఊహించని చోట కూర్చున్నాడు. దీంతో ఆ వీడియో కాస్త నెటిజన్ల కంట పడి.. హల్‌చల్ అవుతుంది.

‘ముందైతే నాకు కొంచెం కూడా అర్థం కాలేదు’ అనే క్యాప్షన్‌తో నెట్టింట ప్రత్యక్షమైన ఈ వీడియోలో ఒక యువకుడు తన ప్రేయసితో బిజీబిజీగా ఫోన్ మాట్లాడుతుంటాడు. అయితే అది కూడా పొలాల మధ్య గుండా వెళ్లే ఒక దారికి పక్కన ఉన్న గోతిలో కూర్చుని మరీ మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ‘ఎంత ప్రేమలో పడితే మాత్రం ఇంతలా.. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మాట్లాడాలా..?’ అంటూ నెటిజన్లు సరదా సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Psycho Bihari (@bihari.broo)

కాగా, bihari.broo అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 7300 వందల మంది లైక్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వారిలో ఒక నెటిజన్ ‘నాకు కూడా ఎవరైన దొరికితే బాగుండు’ అని కామెంట్ చేయగా..‘వీడు కూడా నాలాంటోడే.. ప్రేమ పిచ్చోడు’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..