Kidney Health: కిడ్నీసమస్యలతో బాధపడుతున్నారా..? వెంటనే ఈ 5 అలవాట్లకు స్వస్తి పలకండి.. లేకపోతే పెను ప్రమాదమే..!

మంచి ఆరోగ్యం కోసం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఎందుకంటే ముత్రపిండాలు మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపకుండా చేస్తాయి. కానీ కిడ్నీల్లో ఏదైనా

Kidney Health: కిడ్నీసమస్యలతో బాధపడుతున్నారా..? వెంటనే ఈ 5 అలవాట్లకు స్వస్తి పలకండి.. లేకపోతే పెను ప్రమాదమే..!
Kidney Health
Follow us

|

Updated on: Mar 09, 2023 | 9:51 PM

సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను పాటించకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే శరీర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి.  అటువంటి అవయవాలలో మూత్రపిండాలు కూడా ఉన్నాయి. శరీరంలోని ముఖ్యమైన అవయవ భాగాలలో కిడ్నీలు కూడా ప్రముఖమైనవి. మూత్రపిండాలు పనితీరులో చిన్న మార్పులు కూడా ప్రమాదకర సమస్యలకు కారణం కాగలవు. కిడ్నీలు మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. మంచి ఆరోగ్యం కోసం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఎందుకంటే ముత్రపిండాలు మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపకుండా చేస్తాయి. కానీ కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. లేకపోతే పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. నిద్ర: ఆరోగ్యంగా ఉండటానికి పుష్కలంగా నిద్ర పోవడం చాలా అవసరం. కానీ కిడ్నీ రోగులు పగటివేళ ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల.. కిడ్నీల్లోకి మూత్రం ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లోనే నిద్రపోవాలి.
  2. అధిక ఉప్పు: ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. ఉప్పులో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మీకు ఏదైనా కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే ఉప్పు తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
  3. నీరు తక్కువగా తాగడం: కిడ్నీలు శుభ్రం కావాలంటే పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవు. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలోనే వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి.. మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
  4. నీరస పడిపోవడం: కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు శరీరం చురుగ్గా ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. మీ కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే మీరు తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయాలని.. దీనివల్ల శరీరం చురకుగా మారుతుందని పేర్కొంటున్నారు.
  5. పొటాషియం: కిడ్నీ పేషెంట్లు పొటాషియం ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు. ఇంకా కిడ్నీ సమస్యలు ఉంటే బంగాళదుంపలు, బత్తాయి వంటి వాటిని కూడా తీసుకోకూడదు. అరటిపండ్లు, అవకాడోలు తినడం కూడా కిడ్నీ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పొటాషియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!