H3N2 Virus: మనుషులను బలి తీసుకుంటున్న కొత్త వైరస్.. ఆ రాష్ట్రాల్లో రెండు మరణాలు నమోదు.
కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరిచిపోకముందే మరో మాయదారి రోగం ప్రజలపై దండెత్తడానికి వస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. బారిన పడుతోన్న వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. సాధారణ జ్వరం, జలుబుగా మొదలైన ఈ వ్యాధి మనిషి ప్రాణాలను...
కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరిచిపోకముందే మరో మాయదారి రోగం ప్రజలపై దండెత్తడానికి వస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. బారిన పడుతోన్న వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. సాధారణ జ్వరం, జలుబుగా మొదలైన ఈ వ్యాధి మనిషి ప్రాణాలను బలితీసుకునే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.
హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకలో కూడా మరో వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే బాదితులు జ్వరం, దగ్గు, శ్వాస కోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ వైరస్ విషయంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. విశాఖపట్నంలో ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది ఏపీ వైద్య శాఖ ప్రకటించింది.
ఈ లక్షణాలతో ఉన్న పిల్లల్ని స్కూళ్లకి పంపొద్దని అధికారులు ఆదేశించారు. ఇక ఈ వైరస్ లక్షణాల విషయానికొస్తే.. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలగు రోజుల్లో తెలిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన పడిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..