AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health: మహిళల ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడే ఆహార పోషకాలివే.. ప్రయోజనాలేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

స్త్రీలు తీసుకునే ఆహారంలో సరిపడా పోషకాలు లేకపోవడమే వారి ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం. ఆ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడే అనేక రకాల పోషకాలతో కూడిన..

Women's Health: మహిళల ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడే ఆహార పోషకాలివే.. ప్రయోజనాలేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Women's Health Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 08, 2023 | 2:26 PM

Share

ప్రస్తుత కాలంలోని జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పుల కారణంగా చాలా మంది మహిళలు.. అధిక  బరువు, బీపీ, డయాబెటీస్ వంటి పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి స్త్రీలు తీసుకునే ఆహారంలో సరిపడా పోషకాలు లేకపోవడం కూడా ప్రధాన కారణమే. ఆ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడే అనేక రకాల పోషకాలతో కూడిన సమతూల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేడ్స్, ప్రోటిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పలు రకాల పోషకాలను స్త్రీలు తమ శరీరానికి ఎప్పడూ అందిస్తుండాలి. లేకపోతే పోషకాహార లోపంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం నానాటికీ పెరుగుతుంది. అంతేకాక వారిలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితి ఎదురవకుండా ఎలాంటి పోషకాలను శరీరానికి తప్పని సరిగా ఇవ్వాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బి12: మెదడు సక్రమ పనితీరుకు బి12 అవసరం. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్తకణాల సంఖ్య పెరిగి, శక్తి సమకూరాలన్నా బి12 దొరికే మాంసాహారం, పాల ఉత్పత్తులు సరిపడా తీసుకుంటూ ఉండాలి.

క్యాల్షియం: ఎముకల పటుత్వానికి క్యాల్షియం అవసరం. గుండె, నాడులు, కండరాల పనితీరుకు తోడ్పడే క్యాల్షియం కోసం పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఐరన్‌: శక్తికి భాండాగారం వంటిది ఇది. శరీరమంతా ఆక్సిజన్‌ ప్రసారానికి ఈ పోషకం అవసరం. రోగనిరోధకశక్తికి దన్నుగా ఉండి, కండరాల పనితీరును క్రమపరిచే ఐరన్‌ లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, మాంసాహారం సరిపడా తీసుకుంటూ ఉండాలి.

బయోటిన్‌: చర్మం, వెంట్రుకలు, గోళ్ల ఆరోగ్యానికి ఈ పోషకం అవసరం. నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ, గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్ధంగా ఉండాలన్నా బయోటిన్‌ సమృద్ధిగా ఉండే గుడ్లు, చిక్కుళ్లు, నట్స్‌, సీడ్స్‌, చిలకడ దుంపలు, మష్రూమ్స్‌ తింటూ ఉండాలి.

మెగ్నీషియం: గుండె ఆరోగ్యాన్ని మెగ్నీషియం మెరుగుపరచడంతో పాటు భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. స్త్రీల నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. కండరాల బలహీనతను తొలగిస్తుంది. కాబట్టి మెగ్నీషియంతో కూడిన అరటిపండ్లు, అవకాడొ, పాలకూర, గుమ్మడి విత్తనాలు, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పు, సోయా తింటూ ఉండాలి.

విటమిన్‌ డి: మెదడు, కండరాలు, ఇమ్యూనిటీలకు విటమిన్‌ డి అవసరం. ఈ విటమిన్‌ కోసం గుడ్లు, చేపలు, పాలు, నారింజ రసం, జున్ను, సోయా తీసుకుంటూ ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..