AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర్యాపిడో రైడర్‌తో ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్ కావడంతో రంగంలోకి పోలీసులు.. చివరకు ఏమయ్యిందంటే..?

డెలివరీ తెచ్చి ఇచ్చినవారికి టిప్‌గా కనీసం రూపాయి అయినా ఇవకపోయినా పర్వాలేదు, కానీ వారిని సాటి మనిషిగా అయినా గౌరవించాలి కదా..! కానీ అందుకు..

ర్యాపిడో రైడర్‌తో ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్ కావడంతో రంగంలోకి పోలీసులు.. చివరకు ఏమయ్యిందంటే..?
Auto Driver Harassing Rapido Bike Taxi Driver
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 08, 2023 | 12:39 PM

Share

ఈ మధ్య ర్యాపిడో, జొమాటో డెలివరీ బాయ్స్ మీద దాడి జరుగుతున్న ఘటనల సంఖ్య బాగా పెరిగిపోయింది. డెలివరీ తెచ్చి ఇచ్చినవారికి టిప్‌గా కనీసం రూపాయి అయినా ఇవకపోయినా పర్వాలేదు, కానీ వారిని సాటి మనిషిగా అయినా గౌరవించాలి కదా..! కానీ అందుకు విరుద్ధంగా కొందరు ప్రబుధ్దులు.. డెలివరీ లేట్ అయిందని, తెచ్చిన ఫుడ్ ఐటమ్ చల్లబడిపోయిందంటూ ఏవేవో కారణాలతో వారిపై భౌతిక దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరులో జరిగిన మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇందిరా నగర్‌లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగగా, మార్చి 5న వీడియో రూపంలో నెట్టింట ప్రత్యక్షమయింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

ఇక వైరల్‌గా మారిన ఆ వీడియోలో రాపిడో డెలివరీ బాయ్‌తో ఒక ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనకు ముందు ఏం జరిగిందో తెలియరాలేదు కానీ డెలివరీ బాయ్ బైక్ తాళాలు లాక్కొని, అతను తెచ్చిన డెలివరీని నేలకేసి కొట్టాడు సదరు ఆటో డ్రైవర్. అంతేకాక డెలివరీ బాయ్ మీద చేజేసుకోబోయాడు కూడా. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో freedom of speech B,lore అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. దీంతో రంగంలోకి దిగిన బెంగళూరు నగర పోలీసు విభాగం ‘ఇందిరా నగర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.  అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకుంటామ’ని ట్విట్టర్ ద్వారా సదరు వీడియోకు రిప్లై ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హేమలత అనే నెటిజన్ ‘ఇంత దారుణమా..? ఇలాంటివాళ్లను బెంగళూరు సిటీ నుంచి బహిష్కరించాలి’ అని కామెంట్ చేయగా.. ‘ఇదే తరహా ఘటనలు రిపీట్ అయితే ఆటోలను బ్యాన్ చేసి, నడుచుకుంటూ లేదా బస్ లేదా మెట్రో ద్వారా ప్రయాణం చేస్తామ’ని రాహుల్ అనే మరో నెటిజన్ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.