Corpse in Dream: కలలో శవం కనిపించిందా..? దాని అర్థం, ఫలితాలు ఇవే..!
సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి. కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే..
Corpse in Dream: మనలో చాలా మందికి కలలు వస్తూ ఉంటాయి. అయితే తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయి అని చాలామంది అంటారు. స్వప్నంలో కొన్ని వస్తువులు కనిపించినా, జంతువులు కనిపించినా చేటు అని నమ్మేవారు కూడా ఉంటారు. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం మనకు వచ్చే కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి.ఈ క్రమంలోనే చాలా మందికి పాములు కలలో వస్తాయి. ఇలా వస్తే ఏదో కీడు అని చాలా మంది భావిస్తారు. అయితే పాము కాటు వేసినట్లు కల వస్తేనే కీడు అని.. పాము కనిపించి వెళ్లిపోతే ఎలాంటి చేటు ఉండదు అని చెబుతారు. సప్న శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి. కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి. సాధారణంగా మనం భయం కలిగించే కలలను మాత్రమే గుర్తుంచుకుంటాం. నిజం ఏమిటంటే మనలో చాలా మంది కలలను చూసిన వెంటనే మరచిపోతారు. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం కలల్లో శవం కనిపిస్తే భవిష్యత్తు గురించి మనకు ఏమి సూచిస్తాయో తెలుసుకుందాం..
కలలో శవం కనిపిస్తే ఏం జరుగుతుంది..? నిద్రపోతున్నప్పుడు కలలో శవాన్ని చూసినప్పుడు చాలా మంది భయపడతారు. ప్రజలు కలలో శవం కనిపిస్తే చెడు జరుగుతుందని భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో శవం కనిపిస్తే శుభ సూచికంగా చెబుతారు. ఒక వ్యక్తి కలలో శవాన్ని చూస్తే అది అతనికి మంచి సంకేతం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కలలో శవాన్ని చూస్తే ఆ వ్యక్తి త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతాడని అర్థం.
వ్యాపారికి లాభాలు: ఒక వ్యాపారవేత్త నిద్రపోయేటప్పుడు తన కలలో ఒక శవాన్ని చూస్తే అది వ్యాపారంలో చాలా లాభం పొందబోతున్నట్లు అర్థం. కలలో శవాన్ని చూడటం ప్రతి కోణం నుంచి శుభమని చెప్పవచ్చు. మీ కలలో మీరు ఎప్పుడైనా శవాన్ని చూసినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా ఈ కల మీకు చాలా పవిత్రమైనది త్వరలో మీరు అనేక సమస్యలను అధిగమించబోతున్నారని అర్థం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..