Surya Grahan 2023: మొదటి సూర్య గ్రహణంతో ఆ 4 రాశుల వారికి కష్టాలు.. లిస్టులో మీరు ఉన్నారేమో చెక్ చేద్దాం రండి..

సూర్య గ్రహణం కొన్ని రాశులకు శుభప్రదమైనదిగా, మరికొందరికి అశుభంగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ఏప్రిల్ 20న ఏర్పడే..

Surya Grahan 2023: మొదటి సూర్య గ్రహణంతో ఆ 4 రాశుల వారికి కష్టాలు.. లిస్టులో మీరు ఉన్నారేమో చెక్ చేద్దాం రండి..
Surya Grahan 2023 Effect
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 07, 2023 | 8:00 AM

ఈ ఏడాది అంటే 2023 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతోంది. జ్యోతిషశాస్త్రంలో ‘గ్రహణం’ అనేది ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన ‘సూర్య గ్రహణం’,  ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సూర్యగ్రహణం అన్ని రాశిచక్ర గుర్తుల స్థానికుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్య గ్రహణం కొన్ని రాశులకు శుభప్రదమైనదిగా, మరికొందరికి అశుభంగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ఏప్రిల్ 20న ఏర్పడే సూర్య గ్రహణం.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది.

అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇక ఈ సూర్యగ్రహణం గ్రహణం ఉదయం 07.04 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 12.29 గంటల వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మేష రాశిలో గ్రహణం ఏర్పడబోతోంది.  భారతదేశంలో సూర్య గ్రహణం కనిపించినప్పటికీ దాని ప్రభావం అనేక రాశుల జాతక చక్రాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాక సూర్య గ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉండడం వల్ల మేషంతో సహా అనేక రాశిచక్ర గుర్తులకు సమస్యలు పెరుగుతాయి. మరి అవి ఏయే రాశులో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో సూర్యుడు మేష రాశిలో మాత్రమే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేష రాశి వారికి కష్టాలు తీరనున్నాయి. వారి కెరీర్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కుటుంబ శాంతికి భంగం కలగవచ్చు. అంతేకాదు ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు కూడా వస్తాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: సింహ రాశికి అధిపతి సూర్యుడే. అందుకే సూర్య గ్రహణం సమయంలో ఈ రాశి చక్రం జీవితాలపై ప్రభావం ఉంటుంది. ఈ రాశి వ్యక్తి కెరీర్‌లో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు చదువు పట్ల మానసిక దృక్పథాన్ని కోల్పోతారు. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలలో కూడా వైఫల్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రారంభంలో ఇబ్బందులు పెరిగినా క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్యా రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి ఎనిమిదవ పాదంలో సూర్య గ్రహణం జరగబోతోంది. ఫలితంగా ఇది మానసిక ఒత్తిడి, బాధను పెంచుతుంది. ఈ కాలంలో కోపం రాకుండా చూసుకోవాలి. లేకుంటే నష్టం జరగవచ్చు. ఎవరితోనైనా ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించకుండా చేసే పనులు భారంగా ఉంటాయి. ఈ సమయంలో నష్టం కూడా జరగవచ్చు. మీ ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే తగువుల పేరుతో విడిపోయే ప్రమాదం ఉంది.

మకర రాశి: మకర రాశి చక్రంలోని నాల్గవ పాదంలో సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఈ రాశి వారి తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పాత వాహనం మీ ఖర్చులను పెంచుతుంది. ఆరోగ్యం చెడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా నడవడం మంచిది. బయట తినడం మానుకోండి. రోగాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఆర్థికంగా చికాకు కలిగిస్తుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..