AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: శతభిషా నక్షత్రంలో శనిదేవుడు సంచారం.. మార్చి 14 నుంచి ఈ 3 రాశులవారికి అంతా అనుకూలమే..

మార్చి 14న శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. నిజానికి ఈ 24వ నక్షత్రానికి అధిపతి రాహువు. పైగా శని, రాహువు ఇద్దరూ మిత్రులు. ఆ కారణంగా శతభిషా..

Astrology: శతభిషా నక్షత్రంలో శనిదేవుడు సంచారం.. మార్చి 14 నుంచి ఈ 3 రాశులవారికి అంతా అనుకూలమే..
Astrology
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 05, 2023 | 6:15 AM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా తమ తమ రాశులను మారుస్తాయి. అయితే ఈ మార్పులు మానవ జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. ఎలా అంటే దాని ఫలితాలు కొందరికి శుభకరంగా, మరి కొందరికి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఈ క్రమంలోనే మార్చి 14న శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. నిజానికి ఈ 24వ నక్షత్రానికి అధిపతి రాహువు. పైగా శని, రాహువు ఇద్దరూ మిత్రులు. ఆ కారణంగా శతభిషా నక్షత్రంలో శనిదేవుడు సంచారం రాశిచక్రంలోని మూడు రాశులవారికి మేలు చేయనుంది. మరి ఆ రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శతభిషా నక్షత్రంలో శనిదేవుడు సంచారం ఈ రాశులకు శుభప్రదం..

మేష రాశి: శనిగ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది. మీ జాతకంలో 12వ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీ పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా ధనాన్ని ఆర్జిస్తారు.

మిథున రాశి: శతభిషా నక్షత్రంలోకి శని దేవుడి ప్రవేశం మిథున రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా వీరికి ఈ సమయంలో ధర్మ సంబంధమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాక ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరగడమే కాక ఫ్యామిలితో మంచి సంబంధాలు ఉంటాయి. అదృష్టం ఈ రాశివారి వెంటే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తులా రాశి: తులరాశి విద్యార్థులకు శతభిషా నక్షత్రంలో శని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది.  అలాగే ఈ రాశివారు పని-వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. బిజినెస్ చేసేవారు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇంకా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..