- Telugu News Photo Gallery Technology photos Top 7 Best Smartphones Under Rs. 20000 In India check here for full list
Smartphones Under 20000: టాప్ 7 అద్దిరిపోయే స్మార్ట్‌ఫోన్లు.. ధర రూ.20 వేల కంటే తక్కువే.. ఓ సారి చూసిపోదాం రండి..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకున్నా.. అందుబాటు ధరలో మంచి ఫోన్ కనిపించడంలేదా..? అయితే మీ కోసమే కొన్ని స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఈ ఫోన్లు మన దేశంలోనే రూ.20 వేల లోపు ధరలో లభించే టాప్ 7 స్మార్ట్‌ఫోన్లు. మరి అవేమిటంటే..
Updated on: Mar 05, 2023 | 7:55 AM

Google Pixel 4G: గూగుల్ పిక్సెల్ 4 ఫోన్ రూ.20 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న టాప్ 7 స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఉంది. దీని రేటు రూ. 19,999. ఇందులో 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.7 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ కూడా ఉంది.

OnePlus Nord CE 2: రూ.20 వేలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 ఫోన్‌ను పరిశీలించవచ్చు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో 64 ఎంపీ కెమెరా, డ్యూయెల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్, నైట్ పోట్రేట్, పానొరమ మోడ్, రీటచ్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభం అవుతోంది.

OPPO A74 5G: ఒప్పో ఏ 74 5జీ ఫోన్ కూడా ఈ లిస్టులో ఉంది. ఇందులో 48 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 6.49 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ వంటి ఫీచర్లు అనేకం ఉన్నాయి. దీని రేటు రూ. 15,490గా ఉంది.

Redmi 9A Sport: రెడ్‌మి 9ఏ స్పోర్ట్ కూడా రూ.20 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న టాప్ 7 అదిరే స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని రేటు రూ. 6499. ఇందులో 32 జీబీ మెమరీ ఉంటుంది. సూపర్ సెల్పీ ఫోటోలు తీసుకోవడానికి మంచి కెమెరా కూడా ఉంది. తక్కువ ధరలో అదిరే ఫోన్ కొనాలని భావించే వారు దీన్ని పరిశీలించవచ్చు.

Samsung Galaxy A23: సామ్సంగ్ గెలాక్సీ ఏ23 స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి ఉంది. ఇందులో 50 ఎంపీ కెమెరా ఉంటుంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, పవర్ ఫుల్ ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 18,499గా ఉంది.

Samsung Galaxy M13: అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ కూడా ఈ జాబితాలో ఉంది. రూ. 20 వేల ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో ఇది కూడా ఒకటి. వివిధ రంగుల్లో లభించే ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 12 జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 12పై పని చేస్తుంది. దీని రేటు రూ. 11,999.

Samsung Galaxy M32: శాంసంగ్ గెలాక్సీ ఎం32 కూడా రూ. 20 వేల లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో ఇది కూడా ఉంది. ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని రేటు రూ. 15,499 నుంచి ప్రారంభం అవుతోంది.





























