- Telugu News Photo Gallery Technology photos Boat launched boat wave flex smartwatch with bluetooth calling Telugu Tech News
BoAt Wave Flex: రూ. 1500లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్.
ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ బోట్ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. బోట్ వేవ్ ఫ్లెక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ కాలింగ్ వంటి అధునాతన టెక్నాలజీని అందించారు. తక్కువ బడ్జెట్‌లో లాంచ్ చేసిన ఈ వాచ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 05, 2023 | 5:44 PM

Smartwatch

ఈ క్రమంలోనే తాజాగా బోట్ వేవ్ ఫ్లెక్స్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1499గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ బోట్-లైఫ్‌స్టైల్.కాం, ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. బోట్ వేవ్ ఫ్లెక్స్ 1.83 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో క్రిస్టల్ క్లియర్ విజువల్స్ అందించడంతో పాటు నోటిఫికేషన్స్, యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ఈ స్మార్ట్ వాచ్‌లో హై డెవినేషన్ స్పీకర్, మైక్రోఫోన్‌తో పాటు 10 కంటాక్ట్‌లను సేవ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. వాయిస్ అసిస్టెంట్ ఈ వాచ్ ప్రత్యేకత.

ఈ స్మార్ట్ వాచ్‌లో ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజుల పాటు నడుస్తుంది. కేవలం 2 గంటల్లోనే 100 శాతం చార్జింగ్ కావడం ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.





























