PM-Kisan: పీఎం కిసాన్ నిధి 13వ విడత డబ్బు ఖాతాలోకి రాలేదా..? వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడతను ఫిబ్రవరి 27న మన ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఇందుకోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం..
రైతుల ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో పీఎం కిసాన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో చేరిన రైతులకు ఏడాదికి రూ.6,000 సాయం అందుతుంది. ఈ మొత్తం కూడా ప్రతి ఏటా మూడు విడతల్లో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడతను ఫిబ్రవరి 27న మన ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఇందుకోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.16800 కోట్లు వెచ్చించింది. 13వ విడతలో 8 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత మంది అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు అందడం లేదు. అన్ని అర్హతలు ఉండి అర్జీ చేసుకున్నా కూడా డబ్బు మాత్రం జమవ్వడం లేదు.
అయితే ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావిస్తే.. కచ్చితంగా బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ అయిన రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందుతాయి. ఇవి లింక్ కాని అన్నదాతలకు మాత్రం రూ.2,000 రావడం లేదు. అందువల్ల మీరు కూడా వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆధార్‌ను లింక్ చేసుకోండి. అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని గుమనించాలి. బ్యాంక్ అకౌంట్‌లో వివరాలు, ఆధార్ కార్డులో వివరాలు రెండూ సరితూగాలి. లేదంటే ఇవి లింక్ కాకపోవచ్చు. మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
ఇది వరకే ఇలా చేసినా కూడా పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే.. ఫిర్యాదు నమోదు చేయడానికి, రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan-ict@gov.inకి వెళ్లాలి. ఇక్కడ వారు 13వ విడతకు సంబంధించిన ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేసింది. హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయడం ద్వారా మీరు మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్- 18001155266, PM కిసాన్ కొత్త హెల్ప్‌లైన్- 011-24300606, PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261, PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్- 011-23381092 మరియు PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్- 011-23381092 మరియు మరొక సహాయానికి కూడా కాల్ చేయవచ్చు. 0120-6025109 మీరు ఫిర్యాదు చేయడానికి కూడా కాల్ చేయవచ్చు. దీనితో పాటు, మీరు ఈ-మెయిల్ ID: pmkisan-ict@gov.inకి ఫిర్యాదును కూడా పంపవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..