- Telugu News Photo Gallery Cricket photos Jhye Richardson ruled out of ODI series due to hamstring injury and likely to play IPL 2023 for Mumbai Indians
Jhye Richardson: వన్డే సిరీస్ నుంచి ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ ఔట్.. కష్టాల్లో పడిన రోహిత్ సేన.. ఎలా అంటే..?
టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్ నేపథ్యంలో ఆసీస్ జట్టుకు, ఐపీఎల ప్రారంభం కానున్న క్రమంలో ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇరు జట్లకు చెందిన ఓ బౌలర్ ప్రస్తుతం గాయం కారణంగా క్రికెట్‌కు దూరం అయ్యాడు. అసలు వివరాలేమిటంటే..?
Updated on: Mar 08, 2023 | 1:53 PM

టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు.. అనంతరం మరో 3 వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆసీస్ జట్టుకు, మరోవైపు రోహిత్ సేనకు బిగ్ షాక్ తలపడింది.

ఇటీవల జరిగిన టెస్టు నుంచి ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్ భారత్ పర్యటన నుంచి దూరమైన తర్వాత, ఆ జట్టు స్టార్ బౌలర్ జే రిచర్డ్‌సన్‌నువన్డే సిరీస్ నుంచి తొలగించారు. భారత్‌తో జరిగిన ODI సిరీస్ కోసం 9 నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు రిచర్డసన్. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతన్ని జట్టు నుంచి తొలగించే పరిస్థితి వచ్చిపడింది.

అసలు ఏం జరిగిందంటే.. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు జే రిచర్డ్‌సన్ దూరమయ్యాడు. ఇప్పుడు అతని స్థానంలో ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్ నాథన్ ఎల్లిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.

గతేడాది జూన్‌లో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా తరఫున చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రిచర్డ్‌సన్.. ఇప్పుడు భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ సారి కూడా ఐపీఎల్‌లో అతను ఆడడం అనుమానమే ఉంది.

రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియా తరఫున వన్డే సిరీస్ ఆడకపోవడం ఖాయం. ఐపీఎల్ ఆడకపోతే ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ఇబ్బంది తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ముంబై జట్టు నుంచి బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైనందున ఇప్పుడు రిచర్డ్‌సన్ ఆడకపోతే రోహిత్ సేనకి భారీ దెబ్బ తగులుతుంది.

కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం 2023లో ముంబై జట్టు జే రిచర్డ్‌సన్‌ను రూ. 1.5 కోట్లకు తమ సొంతం చేసుకుంది.





























