- Telugu News Photo Gallery Cricket photos DCW vs UPW Holi: Delhi Capitals team celebrating holi after win against up warriorz by 42 Runs in telugu
Holi Celebration: రంగ్ బార్సే.. హోలీ రంగుల్లో మునిగి తేలిన దేశ విదేశీ మహిళా క్రికెటర్లు..
దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. భారత క్రికెటర్లు కూడా హోలీ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అహ్మదాబాద్ చేరుకున్న ఆటగాళ్లందరూ రంగుల పండుగను ఎప్పుడూ లేనంతగా జరుపుకున్నారు.
Updated on: Mar 09, 2023 | 5:15 PM

వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ శిబిరం మ్యాచ్ తర్వాత ఉత్సాహంగా ఉంది. జెమీమా రోడ్రిగ్స్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన తన కుటుంబంతో గడిపారు.

మంగళవారం డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ రంగుల పండుగలో పాల్గొనలేకపోయింది. యూపీ వారియర్స్‌పై విజయం తర్వాత ఢిల్లీ శిబిరం రంగురంగులమైంది.

ఢిల్లీ విదేశీ క్రికెటర్లు షెఫాలీ వర్మతో కలిసి హోలీ ఆడారు.

పలువురు విదేశీ క్రికెటర్లు తొలిసారిగా రంగుల పండుగలో పాల్గొన్నారు.

భారతదేశపు 'ఫెస్టివల్ ఆఫ్ కలర్స్'హోలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింట్ వేయడం, కెమెరాకు పోజులు ఇచ్చింది.

తొలి మ్యాచ్‌లో 223, రెండో మ్యాచ్‌లో 211 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 200కి చేరుకుంది. దీని వెనుక ఢిల్లీ బ్యాటర్ల సత్తా కనిపిస్తోంది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జెస్ జోనాసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 20 బంతుల్లో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడింది.

మెగ్ లానింగ్ సారథ్యంలో ఢిల్లీ తమ విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఢిల్లీకి గురువారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఉంది. మరో గట్టిపోటీ కోసం క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.




