- Telugu News Photo Gallery Cricket photos Team India All Rounder Hardik Pandya youngest cricketer in the world to cross 25 million followers on instagram
Hardik Pandya: సోషల్ మీడియా సుల్తాన్‌గా హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు
గతేడాది ఐపీఎల్ టైటిల్‌ను సాధించి ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానూ మంచి పేరు పొందాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అదే ఊపులో టీమిండియా టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.
Updated on: Mar 08, 2023 | 9:58 PM

గతేడాది ఐపీఎల్ టైటిల్‌ను సాధించి ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానూ మంచి పేరు పొందాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అదే ఊపులో టీమిండియా టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.

కొన్ని రోజుల క్రితమే స్టాంకోవిచ్‌తో కలిసి రెండోసారి పెళ్లిపీటలెక్కాడు హార్దిక్. ప్రస్తుతం హాలీడే మూడ్‌లో ఉన్న పాండ్యా సోషల్ మీడియాలో ప్రత్యేక మైలురాయిని సాధించాడు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 25.1 మిలియన్ల ఫాలోవర్లను అంటే 2.51 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు హార్దిక్. ఈ సందర్భంగా వెటరన్ టెన్నిస్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లను అధిగమించి ఈ మైలురాయిని సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు పాండ్యా

ఈ సందర్భంగా 'నన్ను ప్రేమిస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను' అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు హార్దిక్. ఇక హార్దిక్‌కి ట్విట్టర్‌లో 80 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

క్రికెటర్ల గురించి చెప్పాలంటే, విరాట్ కోహ్లీ సోషల్ మీడియా సుల్తాన్ అని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌కు 239 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.




