Women’s Day 2023-Google Doodle: మహిళలకు స్పెషల్ డూడుల్‌తో గూగుల్ శుభాకాంక్షలు.. దాని ప్రత్యేకతేమిటంటే..?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిగ్గజ సెర్చింజన్ ‘గూగుల్’ మహిళల గైరవార్థం ప్రత్యేక డూడుల్‌ను...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిగ్గజ సెర్చింజన్ ‘గూగుల్’ మహిళల గైరవార్థం ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. గూగుల్(Google) పదంలోని ఆరు అక్షరాలను సరిపోయేలా మహిళలు నిర్వర్తించే బాధ్యతలలో కొన్నింటితో ఈ డూడుల్‌ను గూగుల్ రూపొందించింది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ప్రతి అక్షరంలోనూ ఉన్న ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని ఈ గూగుల్ డూడుల్ తెలియజేస్తుంది. ఇంకా మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవుతున్నారనే అంశాల్ని చిత్రించేలా ఈ డూడుల్ ఉంది. ఊదా రంగులో ఉన్నఈ డూడుల్ నెటిజన్లను, ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేలా ఉంది.
ఇంకా గూగుల్ రూపొందించిన ఈ డూడుల్‌పై క్లిక్ చేస్తే, స్క్రీన్ పై నుంచి ఊదా రంగు కాగితాలు వర్షంలా కురుస్తున్నాయి. అలాగే ఊదా రంగు జెండాలు పట్టుకున్న నాలుగు చేతులు స్క్రీన్ కింది భాగంలో కదులుతూ వెళ్తున్నాయి. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ 1908లో ఊదా రంగు దుస్తులు ధరించారు. అందుకే ఈసారి గూగుల్ తన డూడుల్ కోసం ఊదా రంగు థీమ్‌ను ప్రత్యేకంగా ఎంచుకుంది. ఇంకా దీనికి సంబంధించిన డూడుల్‌తో కూడిన ట్వీట్‌ను కూడా పోస్ట్ చేసింది గూగుల్.
Celebrating women who grow and build together, and support each other; today, tomorrow, and everyday ?#GoogleDoodle #IWD2023 pic.twitter.com/FmCP09Shz6
— Google India (@GoogleIndia) March 7, 2023
మానవ జీవితంలో మహిళలే కీలక సంరక్షకులుగా ఉంటారని, మాతృత్వంలో మహిళలు ఒకరితో ఒకరు తోడుగా ఉంటారని గూగుల్ పేర్కొంది. జీవితంలో పరస్పరం సహకరించుకుంటూ, ప్రగతికి కారణమవుతున్న మహిళల గౌరవార్థం ఈ డూడుల్ రూపొందించామని, మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని గూగుల్ తన క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. తాజా డూడుల్‌ను అలిస్సా వినాన్స్ అనే మహిళా ఆర్టిస్ట్ డిజైన్ చేసింది. ఇక ఆమె డూడుల్స్ రూపొందించడంలో దిట్ట అని చెప్పుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి