Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Millionaires Trusted cities : మిలీయనీర్లంతా తిష్ట వేసింది ఆ నగరాల్లోనే.. అవేంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి

ప్రపంచవ్యాప్తంగా టాప్‌ మిలీయనర్లు కొన్ని నగరాల్లో మాత్రమే ఉంటున్నారు. ఇటీవల  హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ ప్రపంచంలో ఎక్కువ మిలీయనీర్లు ఉండే నగరాల వివరాలను వెల్లడించింది.

Millionaires Trusted cities : మిలీయనీర్లంతా తిష్ట వేసింది ఆ నగరాల్లోనే.. అవేంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
Cities
Follow us
Srinu

|

Updated on: Mar 08, 2023 | 1:00 PM

భారతీయలు టాప్‌ 10 బిలీయనీర్లలో ఉన్నా ఎక్కువ శాతం మిలీయనీర్లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నగరాల్లోనే ఉంటున్నారు. ఆదానీ, అంబానీ వంటి వారు టాప్‌ 10 బీలియర్లుగా స్థానం సంపాదించుకున్నారు. ఇలా చాలా మంది బీలినియర్లుగా, మిలీనియర్లుగా ఉంటారు. వీరు ఎంత లగ్జరీగా గడుపుతున్నారు. వీరు ఇళ్లు ఎలా ఉంటాయి? సెక్యూరిటీ ఏంటి? అని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ప్రపంచవ్యాప్తంగా టాప్‌ మిలీయనర్లు కొన్ని నగరాల్లో మాత్రమే ఉంటున్నారు. ఇటీవల  హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ ప్రపంచంలో ఎక్కువ మిలీయనీర్లు ఉండే నగరాల వివరాలను వెల్లడించింది. ఆయా నగరాల్లో ఉండే సదుపాయాలు, రక్షణ ఏర్పాట్లు, వ్యాపార నిర్వహణకు అవసరమయ్యే మానవ వనరులు వంటి లభ్యత వల్ల మిలీయనీర్లు ఎక్కువగా ఆయా నగరాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయా నగరాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

న్యూయార్క్

అత్యధిక సంఖ్యలో మిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. నగరంలో 3,45,600 అధిక-నికర-విలువ ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే 737 సెంటీ-మిలియనీర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది నికర విలువ 100 మిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ. అలాగే న్యూయార్క్‌లో కూడా 59 మంది బిలియనీర్లు ఉన్నారు.

టోక్యో

జాబితాలో టోక్యో రెండో నగరం. ఇది 263 సెంటీ-మిలియనీర్లు మరియు 12 బిలియనీర్లతో సహా 3,04,900 మంది మిలియనీర్లు నివాసం ఉంటారు.

ఇవి కూడా చదవండి

శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా

మూడవ స్థానంలో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా ఉంది. ఇక్కడ 2,76,400 మంది మిలియనీర్లు ఉంటారు. వీరిలో 623 మంది సెంటి-మిలియనీర్లు కాగా, 62 మంది బిలియనీర్లు.

లండన్

ఈ నగరం గురించి చాలా మందికి తెలుసు. లండన్‌లో 2,72,400 మంది మిలియనీర్లు ఉంటారు. 9,210 మంది మల్టీ-మిలియనీర్లు, 406 సెంటీ-మిలియనీర్లు, 38 బిలియనీర్లు ఉన్నారు.

సింగపూర్

సింగపూర్‌లో 2,49,800 మంది మిలియనీర్లు ఉంటారు. అలాగే 8,040 మంది మల్టీ మిలియనీర్లు, 336 మంది సెంటి-మిలియనీర్లు నివాసం ఉంటున్నారు. అలాగే 26 మంది బిలియనీర్లు ఉన్నారు.

లాస్ ఏంజెల్స్ & మాలిబు

యూఎస్ఏలోని లాస్ ఏంజెల్స్ & మాలిబులో 192,400 మంది మిలియనీర్లు ఉన్నారు. అలాగే 8,590 మంది మల్టీ-మిలియనీర్లు, 393 సెంటీ-మిలియనీర్లు, 34 మంది బిలియనీర్లు ఉన్నారు.

చికాగో

యూఎస్‌లోని అతిపెద్ద నగరాల్లో చికాగో ఒకటి. అత్యధిక సంఖ్యలో లక్షాధికారులు నివసిస్తున్న నగరాల జాబితాలో ఇది ఏడవ స్థానంలో ఉంది. ఇందులో 160,100 మంది మిలియనీర్లు, 7,400 మంది మల్టీ మిలియనీర్లు, 340 మంది సెంటీ మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లు ఉన్నారు.

హ్యూస్టన్

హ్యూస్టన్‌లో 1,32, 600 మంది మిలియనీర్లు, 6,590 మంది మల్టీ-మిలియనీర్లు, 314 మంది సెంటి-మిలియనీర్లు, 25 మంది బిలియనీర్లు ఉన్నారు.

బీజింగ్

బీజింగ్ ప్రపంచంలో అత్యధిక మంది మిలియనీర్లు ఉన్న తొమ్మిదో నగరం. ఇక్కడ 1,31,500 మంది మిలియనీర్లు, 6,270 మంది మల్టీ మిలియనీర్లు, 363 మంది సెంటీ మిలియనీర్లు, 44 మంది బిలియనీర్లు ఉన్నారు.

షాంఘై

షాంఘై అత్యధిక సంఖ్యలో మిలియనీర్లు ఉన్న పదో నగరం. ఇందులో 1,30,100 మంది మిలియనీర్లు, 6,180 మంది మల్టీ మిలియనీర్లు, 350 మంది సెంటీ మిలియనీర్లు, 42 మంది బిలియనీర్లు ఉన్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి