Survey: దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..
Survey: కరోనా (Corona) మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనారోగ్యం బారిన పడడం, ఉద్యోగాలు కోల్పోవడం వెరసి ఎన్నో కుటుంబాలు ఆదాయాలు కోల్పోయాయి. అయితే ఓవైపు నిరుద్యోగం పెరిగినా, ప్రజల ఆదాయాలు పడిపోయినా..
Survey: కరోనా (Corona) మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనారోగ్యం బారిన పడడం, ఉద్యోగాలు కోల్పోవడం వెరసి ఎన్నో కుటుంబాలు ఆదాయాలు కోల్పోయాయి. అయితే ఓవైపు నిరుద్యోగం పెరిగినా, ప్రజల ఆదాయాలు పడిపోయినా మరోవైపు దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరగడం విశేషం. హురున్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ సమయంలోనూ గతేడాది (2021) దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. అంతేకాదు రూ. 7 కోట్లకు పైగా సంపద ఉన్న వారి సంఖ్య 2021 డిసెంబర్ నాటికి 4.58 లక్షలకు చేరిందని సర్వేలో వెల్లడించారు.
2020తో పోలీస్తే ఈ సంఖ్య 11 శాతం అధికం కావడం విశేషం. ఇదిలా ఉంటే 2026 నాటికి ఈ సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగి, 6 లక్షలకు చేరొచ్చని హురున్ సర్వే అంచనా వేసింది. ఈ విషయమై హురున్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అనస్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘రానున్న పదేళ్లలో విలాసవంత బ్రాండ్లకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఈ రంగంలోకి అడుగుపెట్టడం లేదా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై కంపెనీలు దృష్టి సారించాలని’ సూచించారు. ఈ సర్వేలో ఇంకా తేలిన విషయాలు ఏంటంటే..
- కోటీశ్వరులు అత్యధికంగా ఉన్న నగరాల్లో 20,300 మందితో దేశ ఆర్థిక రాజధాని ముంబయి మొదటి వరుసలో నిలిచింది. తర్వాత స్థానాల్లో 17,400 మందితో ఢిల్లీ, 10,500 మందితో కోల్‌కతా ఉన్నాయి.
- ఇక కోట్లు సంపాదిస్తున్న వారిలో 33 శాతం మంది సామాజిక బాధ్యత కోసమే పన్నులు చెల్లిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. అలాగే 19 శాతం మంది తాము సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇస్తున్నట్లు తెలిపారు.
- అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఏకంగా 66 శాతం మంది తమ పిల్లలను విదేశాల్లో చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో తేలింది. వీరిలో ఎక్కువ మంది అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.