Hyderabad DCCB Recruitment 2022: హైదరాబాద్ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ. 57 వేల జీతం..
TSCAB DCCB Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 52 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (7), స్టాఫ్ అసిస్టెంట్ (45) […]
TSCAB DCCB Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (7), స్టాఫ్ అసిస్టెంట్ (45) పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.17,900ల నుంచి రూ.57,860ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రెండు దశ(ప్రిలిమ్స్, మెయిన్స్)ల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 60 (1 గంట) నిముషాల వ్యవధిలో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. మెయిన్స్ 160 మార్కులకు 160 ప్రశ్నలకు 2 రెండు గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో ఈ పరీక్షలు జరుగుతాయి. సిలబస్, ఎగ్జాం ప్యాట్రన్ వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ. 900
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 250
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 6, 2022.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఏప్రిల్ 23 లేదా 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: