AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: దేశ రాజధానిలో ఘోర ఘటన.. ఓ ప్లాట్‌లో పాక్షిక నగ్న స్థితిలో యువతి అనుమానాస్పద మృతి!

దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని ఓ ప్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృత దేహం లభించింది. గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణతో తేలింది..

Delhi: దేశ రాజధానిలో ఘోర ఘటన.. ఓ ప్లాట్‌లో పాక్షిక నగ్న స్థితిలో యువతి అనుమానాస్పద మృతి!
Crime News
Srilakshmi C
|

Updated on: Feb 19, 2022 | 1:34 PM

Share

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని ఓ ప్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృత దేహం లభించింది. గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణతో తేలింది. కాగా శుక్రవారం (ఫిబ్రవరి 18) రాత్రి వెలుగుచూసిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు..

బురారీ ప్రాంతంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌ (Kaushik Enclave)లోని ఒక ప్లాట్‌లో అమన్‌, అతని భార్య ప్రియాంక రావత్‌తోకలిసి నివసిస్తున్నాడు. కాగా శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లిన ప్రియాంక రావత్‌, ఇంటికి రాత్రి 8 గంటలకు చేరుకుంది. ఇంటిలోపలికి ప్రవేశించిన మహిళ అక్కడి సంఘటన చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మంచంపై పాక్షిక నగ్న స్థితిలో ఉన్న యువతి మృతదేహం కనిపించింది. భయాందోళనలకు గురైన ప్రియాంక వెంటనే బురారీ పోలీసులకు (Burari police station) ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి మహిళ భర్త అమన్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. యువతిని హత్య చేసి, అమన్‌ పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా మృతురాలు నాథుపుర (Nathupura) ప్రాంతానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై మృతురాలి తండ్రికి సమాచారం అందించారు. ఘటనపై ఓ అధికారి మాట్లాడుతూ.. మృతురాలితో అమన్‌కి చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఏ పరిస్థితుల్లో హత్య జరిగింది, దాని వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు అమన్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read:

Health care tips: రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తిన్నారంటే.. థైరాయిడ్‌, బీపీ, ఉబకాయం ఖాయం!