AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health care tips: రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తిన్నారంటే.. థైరాయిడ్‌, బీపీ, ఉబకాయం ఖాయం!

వేళా పాళా లేని తిండి గంపెడు రోగాలను మోసుకొస్తుంది. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవలన శైలి కారణంగా వేళకు భోజనం చేయడం దాదాపు చాలామందికి కష్టతరమైంది..

Health care tips: రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తిన్నారంటే.. థైరాయిడ్‌, బీపీ, ఉబకాయం ఖాయం!
Health Care
Srilakshmi C
|

Updated on: Feb 19, 2022 | 12:24 PM

Share

Make a distance from these food items before sleeping: వేళా పాళా లేని తిండి గంపెడు రోగాలను మోసుకొస్తుంది. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవలన శైలి కారణంగా వేళకు భోజనం చేయడం దాదాపు చాలామందికి కష్టతరమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ విధమైన అలవాట్ల వల్ల థైరాయిడ్‌, మధుమేహం (డయాబెటిస్‌), హైబీపీ వంటి తీవ్రమైన వ్యాధులు మనల్ని సులువుగా పట్టుకుంటాయంటున్నారు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహారాలను తరచుగా తీసుకున్నట్లయితే పైన తెల్పిన వ్యాధులతోపాటు, ఊబకాయం బారిన పడుతున్నట్లు పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రుళ్లు నిద్రకు ఆపక్రమించే ముందు ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే..

అధిక మొత్తంలో ఆహారం తీసుకోకూడదు రాత్రిపూట చేసే డిన్నర్ చాలా సింపుల్‌గా ఉండాలి. అలాకాకుండా కడుపు నిండుగా తిన్నారంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని, ఎసిడిటీ వంటి తదితర సమస్యలు ప్రారంభమౌతాయి. అంతే కాదు..హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఊబకాయాకి (obesity) కారణమౌతుంది. నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

చక్కటి పిండి మైదాతో తయారు చేసిన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట మైదాతో తయారు చేసిన ఆహారాన్ని తినడం వల్ల త్వరగా ఉబకాయం వస్తుంది. శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

కోల్డ్‌ డ్రింక్‌ చాలా మంది కోల్డ్‌ డ్రింక్‌ను అమితంగా ఇష్టపడతారు. ఇలాంటివారు సమయంఅంటూ లేకుండా రోజులో ఎప్పుడైనా కోల్డ్‌ డ్రింక్స్‌ తాగుతుంటారు. ఐతే రాత్రి పడుకునే ముందు ఇటువంటి పానియాలు తాగితే కొవ్వు త్వరగా పెరుగుతుంది.

ఆల్కహాల్‌ తీసుకోకూడదు రాత్రి పూట మద్యం సేవించే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అలవాటును ఇప్పటికిప్పుడ వదులుకోవడం కష్టమైనప్పటికీ, సాధన ద్వారా కొంత దూరంగా ఉండొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆల్కహాల్ తీసుకుని నిద్రపోవడం వల్ల శరీర జీవక్రియ (metabolism) తగ్గిపోతుంది. దీని ప్రభావం జీర్ణవ్యవస్థపై పడి.. క్రమంగా స్థూలకాయానికి చేరువయ్యేలా చేస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read:

Be alert: ఆన్‌లైన్‌ డేటింగ్‌ వలపు వల మోసాలు!.. ఇలా చేశారంటే మీరు సేఫ్‌..