AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be alert: ఆన్‌లైన్‌ డేటింగ్‌ వలపు వల మోసాలు!.. ఇలా చేశారంటే మీరు సేఫ్‌..

అసలు ఆన్‌లైన్ డేటింగ్ అంటే ఏమిటి? ఈ డేటింగ్‌ యాప్‌ల ద్వారా ఎలా టార్గెట్ చేస్తారు? ఈ మోసాలను ఎలా నివారించాలి? వీటన్నింటికీ సమాధానంగా ఆన్‌లైన్ మోసాలను నివారించడానికి McAfee కొన్ని ముఖ్య విషయాలను సూచించింది. అవేంటంటే..

Be alert: ఆన్‌లైన్‌ డేటింగ్‌ వలపు వల మోసాలు!.. ఇలా చేశారంటే మీరు సేఫ్‌..
Dating App
Srilakshmi C
|

Updated on: Feb 19, 2022 | 11:37 AM

Share

Romance scams: గత కొంత కాలంగా ఆన్‌లైన్ డేటింగ్ (online dating apps) ట్రెండ్ నడుస్తోంది. డేటింగ్ యాప్‌ వలలో చిక్కుకుని ఎంతో మంది లబోదిబోమంటున్న ఉందంతాలు కోకొల్లలుగా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది (2021) ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) మనదేశంతో సహా ప్రపంచంలోని 194 దేశాలకు ఇలాంటి యాప్‌ల గురించి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోల్సిన జాగ్రత్తల గురించి నొక్కిఒక్కానించింది. అసలు ఆన్‌లైన్ డేటింగ్ అంటే ఏమిటి? ఈ డేటింగ్‌ యాప్‌ల ద్వారా ఎలా టార్గెట్ చేస్తారు? ఈ మోసాలను ఎలా నివారించాలి? వీటన్నింటికీ సమాధానంగా ఆన్‌లైన్ మోసాలను నివారించడానికి McAfee కొన్ని ముఖ్య విషయాలను సూచించింది. అవేంటంటే..

ఆన్‌లైన్ లావాదేవీలు చేయకపోవడం మంచిది ఆన్‌లైన్ డేటింగ్ నేరాల్లో ఎక్కువగా జరిగేవి.. నేరుగా ఎదుటివారిని మోసం చేసి డబ్బులు దండుకోవడమే. కాబట్టి ఈ తరహా డేటింగ్‌లో ఆన్‌లైన్ లావాదేవీలు చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. డేటింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదు చెయ్యాలి. యూజర్ అకౌంట్‌ నుంచి డబ్బు దొంగిలించడానికి హ్యాకర్లకు ఇది సువర్ణావకాశం. కాబట్టి ఇలా అస్సలు చేయకండి. అంతేకాదు.. ఇలాంటి సందర్భాల్లో డెబిట్ కార్డ్ వివరాలను రీలోడ్ చేయమని హ్యాకర్లు తరచుగా వినియోగదారుని అడుగుతారు కూడా. మీ అకౌంట్‌ నుంచి డబ్బు మాయం అయితే మళ్లీ రికవరీ చేయడం కష్టం అవుతుంది.

డిజిటల్ గిఫ్ట్ కార్డుల వినియోగం.. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల పేరుతో హ్యాకర్లు డిజిటల్ గిఫ్ట్ కార్డులను పంపుతారు. ఈ గిఫ్ట్ కార్డుల ద్వారా కూడా వినియోగదారుకు సంబంధించిన వివరాలు స్కామర్లకు చేరతాయి. కాబట్టి అటువంటి లింక్‌లపై అస్సలు క్లిక్ చేయకండి.

సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఓ కన్నేసి ఉండండి.. నిజానికి ఇలాంటి మోసాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా వినియోగిస్తారు. అన్నింటికంటే ముందుగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవాలి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఇలా లాక్‌ చేసుకునే సదుపాయం ఉంటుంద. అలాగే సోషల్ మీడియాల్లో షేర్ చేయబడిన ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ లింక్‌లపై కూడా అస్సలు క్లిక్ చేయకూడదు. థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ల నుంచి ఇటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకూదు. ఇవన్నీ మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి.

మొబైల్ నంబర్లను ఇవ్వొద్దు.. ఈ యాప్‌లలో మాట్లాడాలనే సాకుతో మొబైల్ నంబర్లను షేర్ చేయమని హ్యాకర్లు అడుగుతారు. ఇక ఫోన్‌ చేసి మాట్లాడే సమయంలో అనేక కట్టు కథలు చెప్పి, వివిధ స్కీముల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పిస్తారు. ఆ తర్వాత కథ మళ్లీ మొదటికొస్తుంద. మీరు ఎప్పుడైనా అటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే Google Play Store నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

హ్యాకర్ల ఫోటోలను చెక్‌ చెయ్యాలి.. హ్యాకర్లకు సంబంధించిన ప్రొఫైల్‌ ఫొటో నిజమైనదో.. కాదో.. చెక్‌ చేయాలి. ప్రొఫైల్‌లో ఉన్న ఫోటోను గూగుల్‌లో రివర్స్ సెర్చ్ చెయ్యాలి. లేదంటే అదే వ్యక్తికి సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం సదరు వ్యక్తిని అడగాలి. ఇలా చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి హ్యాకరో లేదా నిజమైన వ్యక్తో తెలిసిపోతుంది.

Also Read:

APVVP Vijayanagaram District Jobs: రాత పరీక్షలేకుండా..విజయనగరం జిల్లాలో 96 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..