Telangana crime: వ్యక్తిని చితకబాదిక ఎస్సై.. రక్తం వచ్చేలా బెల్టుతో దాడి.. చర్యలకు ఎస్పీ ఆదేశం

తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూర్‌(Kattanguru) ఎస్సై విజయ్‌కుమార్‌.. భూ వివాదం కేసులో ఓ వ్యక్తిని చితకబాదాడు. రక్తం వచ్చేలా బెల్ట్‌ తో విచక్షణా రహితంగా కొట్టాడు. తన భర్తను కొట్టొద్దంటూ..

Telangana crime: వ్యక్తిని చితకబాదిక ఎస్సై.. రక్తం వచ్చేలా బెల్టుతో దాడి.. చర్యలకు ఎస్పీ ఆదేశం
Kattanguru Si
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 2:03 PM

తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూర్‌(Kattanguru) ఎస్సై విజయ్‌కుమార్‌.. భూ వివాదం కేసులో ఓ వ్యక్తిని చితకబాదాడు. రక్తం వచ్చేలా బెల్ట్‌ తో విచక్షణా రహితంగా కొట్టాడు. తన భర్తను కొట్టొద్దంటూ బాధితుడి భార్య ప్రాధేయపడినా ఏమాత్రం కనికరం చూపలేదు. ఎస్ఐ కొట్టిన దెబ్బలు తాళలేక వీరయ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం వీరయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ విజయ్ కుమార్ తీరుపై ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భూ వివాదంలో తమ తప్పు ఉంటే.. కేసు నమోదు చేయాలి కానీ, బెల్టుతో తీవ్రంగా కొట్టడం ఏమిటని వీరయ్య దంపతులు ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్సైపై విచారణకు నల్గొండ(Nalgonda) జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశించారు. బాధితుడు వీరయ్య నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ వ్యక్తికి చెందిన భూమిని వీరయ్య.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తనకు ఫిర్యాదు అందిందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వీరయ్యను స్టేషన్ కు పిలిపించానని, అతనిని తాను కొట్టలేదని వెల్లడించారు. అక్రమ భూ రిజిస్ట్రేషన్ కు సంబంధించి వీరయ్యపై చీటింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. మరోవైపు.. ఎస్సై విజయ్ కుమార్ చెబుతున్న విషయంలో వాస్తవం లేదని బాధితుడు ఆరోపించాడు. భూ వివాదం కేసులో తనను పిలిపించి తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read

Basthi Dawakhana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. టిమ్స్‌లో పేదలకు అన్ని రకాల కార్పోరేట్ వైద్యంః హరీష్ రావు

TS Government: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల అధిక  ఫీజులకు చెక్‌..!

Knowledge: ప్యాసింజర్‌ రైళ్లలో 24 కోచ్‌లుంటే.. గూడ్స్‌ రైళ్లలో 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఎందుకుంటాయో తెలుసా?