AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Government: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల అధిక  ఫీజులకు చెక్‌..!

TS Government: తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజులు మోత మోగుతోంది. ఈ ఫీజుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు చెల్లించాలని..

TS Government: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల అధిక  ఫీజులకు చెక్‌..!
Subhash Goud
|

Updated on: Feb 19, 2022 | 1:00 PM

Share

TS Government: తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజులు మోత మోగుతోంది. ఈ ఫీజుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చెక్‌ పెట్టనుంది. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు త్వరలో ఊరట లభించనుంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో (Private Educational Institutions) ఫీజుల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకోగా, అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు తెలంగాణ (Telangana) సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఫీజులకు సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రులతో కూడిన మంత్రివర్గ సబ్‌ కమిటీ సమావేశం కానుంది. ఇందులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహ సబ్‌ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజు నియంత్రణక సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నియమ నిబంధనలపై విద్యాశాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి మంత్రుల ముందు సమర్పించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టవడంపై కూడా సబ్‌ కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థలు ప్రత్యేక ట్యూషన్‌ ఫీజుల పేరుతో అధిక మొత్తంలో దండుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు విద్యాసంస్థలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రతి విద్యాసంవత్సరంలో ట్యూషన్‌ ఫీజును 30 శాతం నుంచి 40 శాతం వరకు పెంచుతున్నాయి. అదే విధంగా జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ వంటి వివిధ ప్రవేశ పరీక్షల కోసం ఇంటెన్సివ్‌, స్పెషల్‌ కోచింగ్‌ అంటూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు. అధిక ఫీజులు వసూలను నియంత్రించాలని విద్యార్థుల తల్లిడ్రులు ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. దీంతో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

ఇవి కూడా చదవండి:

Kisan Drones: రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంట పొలాల్లో పురుగుమందు పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లు

Viral Video: మొసళ్లకు కూడా చక్కిలిగింతలు.. సోషల్‌ మీడియాలో మొసలి నవ్వుతున్న వీడియో వైరల్‌