AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basthi Dawakhana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. టిమ్స్‌లో పేదలకు అన్ని రకాల కార్పోరేట్ వైద్యంః హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. . ఇప్పటి వరకు కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని‌ టిమ్స్ లో ఇక అన్ని రకాల‌ వైద్య సేవలు, కార్పోరేట్ ఆ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయన్నారు.

Basthi Dawakhana: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. టిమ్స్‌లో పేదలకు అన్ని రకాల కార్పోరేట్ వైద్యంః హరీష్ రావు
Basthi Dawakhana
Balaraju Goud
|

Updated on: Feb 19, 2022 | 1:43 PM

Share

Basthi Dawakhana In Sangareddy District: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harishrao) తెలిపారు. ఈ మోడల్ ఆసుపత్రులు‌ అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం(Planning Commission) కూడా సూచించిందన్నారు‌. పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం, ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, LIG భారతీ నగరి కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ‌దవాఖానాలనుమంత్రి హరీశ్ రావు ప్రారంభించారు‌.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి గుర్తు చేశారు. ఈ దవాఖానాల్లో నిపుణులు వైద్యులతో పాటు స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకప వైద్య సేనలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయన్న మంత్రి.. బస్తీ దవాఖానాల్లో మీకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు.

అలాగే, టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు మీకు ఉచితంగా చేస్తున్నారన్న మంత్రి.. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు‌ వృధా చేసుకోవద్దని సూచించారు. టీ డయాగ్నసిస్ ద్వారా మీరు రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ మీ సెల్ ఫోన్లకు సమాచారం అందించడం జరగుతుందన్నారు. ఈ ఆసుపత్రి‌సేవలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు. హైదరాబాద్ పరిథిలో 256 బస్తీ‌దవాఖానాల‌ ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేల‌మంది ఉచిత‌ వైద్యం అందుతోంది. పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయని మంత్రి తెలిపారు.

ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు‌ లేవు అన్న సమస్యే ఉండదన్న మంత్రి హరీష్.. పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా ‌సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుుత్రుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని‌ టిమ్స్ లో ఇక అన్ని రకాల‌ వైద్య సేవలు, కార్పోరేట్ ఆ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందే అన్ని రకాల వైద్య సేవలు, గుండె,‌కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు ఉచితంగా పేదలకు టిమ్స్ ద్వారా అందిస్తామన్నారు. పేద ప్రజలకు ఉత్తమ సేవలు అందాలని సీఎం కేసీఆర్ వైద్య రంగాన్ని బలోపేతతం‌ చేస్తున్నారు.

పేదలు ఖర్చు ఎక్కువ పెట్టేది వైద్యం, విద్య పైనే అన్న మంత్రి హరీష్ రావు.. అందుకే ‌సీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా కార్పోరేట్ ఆసుపత్రుల సేవలు అందిస్తూనే , కార్పోరేట్ విద్యా‌సంస్థల్లో అందే విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు మన ఊరు – మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ.7,280 కోట్లతో మన ఊరు – మన బడి పేరుతో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. డిజిటల్‌‌ క్లాస్ రూం‌లు, క్లాస్‌రూంకు రంగులు, మంచి బోర్డులు, బాతు రూం, మంచి నీరు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బొంబాయి కాలనీలోని పాఠశాలను తొలి‌ విడతగా అభివృద్ధి ‌చేస్తామన్న మంత్రి.. పేద పిల్లలకు కార్పోరేట్ తరహా ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తామన్నారు. బొం

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఇక్రిసాట్ ఫెన్సింగ్ కాలనీ వాసులకు, మంత్రి హరీశ్ ‌రావు పట్టాలు పంపిణీ చేశారు. మరో 218 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు సీఎం గారి చేతుల మీదుగా ఇప్పిస్తామన్న హరీష్.. జీవో 58, 59 ద్వారా పఠాన్ చెరు నియోజకవర్గంలో 5 వేల మందికి ఇప్పటికే పట్టాలిచ్చామని తెలిపారు. మరో మారు ఈ జీవో ద్వారా పట్టాలు ఇచ్చ్సే అవకాశాన్ని సీఎం కల్పించారన్నారు. మార్చి 31 వరకు‌ గడువు ఇవ్వడం జరిగింది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.

Read Also…. Kala Thapasvi Rajesh: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత