Techmahindra: నిరుద్యోగులకు టెక్‌మహీంద్రా బంపరాఫర్.. పక్కా జాబ్ పొందే కోర్సులో ఉచితంగా శిక్షణ.
Techmahindra: టెక్నాలజీ రంగంలో రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇలా కొత్తగా వచ్చిన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో..

Techmahindra: టెక్నాలజీ రంగంలో రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఇలా కొత్తగా వచ్చిన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలను దక్కించుకోవాలంటే మారుతోన్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులను నేర్చుకోవాల్సిందే. నిరుద్యోగులకు ఇలాంటి ఓ బంపరాఫర్‌నే అందిస్తోంది ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ టెక్‌మహీంద్రా. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా కొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సును ఉచితంగా అందించనుంది.
వివరాల్లోకి వెళితే.. టెక్‌మహీంద్రాకు చెందిన సీఏస్ఆర్ విభాగం ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ ప్రోగ్రాంను టెక్‌మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉచితంగా శిక్షణ అందివ్వనుంది. ఈ ప్రోగ్రామ్ 12 వారాల పాటు సాగుతుంది. కోర్సులో భాగంగా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నైపుణ్యాలతో పాటు, ఇంటర్వ్యూ స్కిల్స్, రెస్యూమ్ రైటింగ్ వంటి నైపుణ్యాలను నేర్పిస్తాయి. అభ్యర్థులు ఎంట్రీ లెవల్ ఉద్యోగంలో చేరడానికి ఉపయోగపడుతుంది. ఈ కోర్సును ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా సినారియో-బేస్డ్ ఎక్సర్‌సైజులు, హ్యాండ్-ఆన్ ల్యాబ్‌లు, కోర్స్‌వర్క్‌ల ద్వారా, విద్యార్థులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (లైనక్స్, పైథాన్), నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ అండ్ రిలేషనల్ డేటాబేస్ స్కిల్స్ వంటి వాటిని నేర్పిస్తారు.
ఈ ప్రోగ్రామ్ గురించి టెక్‌మహీంద్రా ఫౌండేషన్ సీఈఓ రాకేష్ సోని మాట్లాడుతూ.. ‘క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ 21వ శతాబ్దపు అద్భుత సాంకేతిక ఆవిష్కరణ. ఇది రోజురోజుకీ మారుతోన్న డిజిటల్ ప్రపంచానికి దోహదపడుతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా చాలా వరకు వ్యాపారాలు టెక్నాలజీ ఆధారంగా నడుస్తున్నాయి. దీంతో డేటా స్టోరింగ్ తప్పనిసరిగా మారుతోంది. వెరసి కంపెనీలు క్లౌడ్ ఆధారిత సేవలను వినియోగించుకోక తప్పడం లేదు. ఈ కారణాల వల్లే భవిష్యత్తులో ఈ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నియ’ అని చెప్పుకొచ్చారు.
Also Read: Tollywood : ఒక్క సినిమా క్లిక్ అవ్వడంతో రెమ్యునరేషన్ పెంచేసిన భామలు వీరే..
K. Viswanath: కళాతపస్వి కే.విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు.. మెగాస్టార్ స్పెషల్ విషెస్
Boyapati Srinu : అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. యంగ్ హీరోతో బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్లాన్..