AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K. Viswanath: కళాతపస్వి కే.విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు.. మెగాస్టార్ స్పెషల్ విషెస్

సినిమా ఆయన కల.. సినిమా ఆయన ఊపిరి.. ఆయన ఓ అద్భుతం.. ఆయన సినిమాలు అజరామరం.. తెలుగు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ..

K. Viswanath: కళాతపస్వి కే.విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు.. మెగాస్టార్ స్పెషల్ విషెస్
K Viswanath, Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2022 | 12:38 PM

Share

K. Viswanath: సినిమా ఆయన కల.. సినిమా ఆయన ఊపిరి.. ఆయన ఓ అద్భుతం.. ఆయన సినిమాలు అజరామరం.. తెలుగు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ.. ఆయనే కళాతపస్వి కే విశ్వనాథ్. నేడు ఆ లెజండ్రీ డైరెక్టర్ పుట్టిన రోజు. ఎన్నో వెలకట్టలేని ఆణిముత్యాలాంటి సినిమాలను మనకు అందించారు విశ్వనాథ్. తెలుగు సినిమాలపై విశ్వనాథ్ సంతకం చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సినిమా ప్రపంచానికి ఇద్దరు అద్భుతమైన గీత రచయితలను పరిచయం చేశారు. ఒకరి వేటూరి సుందరరామ్మూర్తి.. మరొకరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన సినిమాలు ఎన్నో నేర్పిస్తాయి.. జీవితాన్ని ఎలా చూడాలో.. ఎలా అర్ధం చేసుకోవాలో విశ్వనాథ్ సినిమాలు మనకు పక్కన కుర్చోబెట్టుకొని చెప్తుంటాయి. కాశీనాథుని విశ్వనాథ్ పుట్టినరోజు  సందర్భంగా ఆయనకు పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

తాజాగా కే.విశ్వనాథ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి.. ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయనతో దిగిన ఓ పాత ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ” గురు తుల్యులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అ జరా మ రం! మీ దర్శకత్వం లో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను” అంటూ విశ్వనాథ్ పై ప్రేమను మరోసారి చాటుకున్నారు మెగాస్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Boyapati Srinu : అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. యంగ్ హీరోతో బోయపాటి పాన్ ఇండియా మూవీ ప్లాన్..

Ashu Reddy: మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న అషు లేటెస్ట్ ఫోటోస్

Ram Charan : నయా లుక్‌తో రచ్చ చేస్తున్న మెగాపవర్ స్టార్.. ఆ సినిమా కోసమేనా..