Ram Gopal Varma: ఎవరి మాట వినకూడదు అనేది నా పాలసీ : రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వర్మకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వర్మకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ పై రచయిత కాంత్ రిసా ఓ పుస్తకాన్ని రాసారు.. ఈ పుస్తకాన్ని చేత్తో రాశారు రచయిత కాంత్ రీసా. ఈబుక్ ను ఆర్జీవీ ఆవిష్కరించారు. ఆర్జీవి ది బ్లూ బుక్ అనే టైటిల్లో రచించిన ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, ఐఏఎస్ ఫణీంద్ర రైటర్ ఆకెళ్ళ, రైటర్ సిరాశ్రి, జర్నలిస్టు వైజయంతి, జర్నలిస్ట్ స్వప్న, TS కల్చరల్ అకాడమీ ఛైర్మెన్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత కాంత్ రీసా మాట్లాడుతూ..ఆర్జీవీని నేను చూసిన కోణం లో ఈ పుస్తకాన్ని తీసుకు వచ్చాను అన్నారు. అలాగే తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. రచయిత రీసా ఒక స్వేచ్ఛా జివి. ఒక స్వేచ్ఛా జీవి మరొక ఆర్జీవీ లాంటి స్వేచ్చా జీవి పై పుస్తకం రాయడం గ్రేట్.. ఆర్జీవీ ఒక ప్రవక్త, వందమంది ఆర్జీవీ లు వద్దు ఒక్క ఆర్జీవీ నే తట్టుకోలేకపోతున్నాము. దర్శకుడు అంటే తను ముందే సినిమాను ఉహించుకొని.. దాన్ని అలాగే తీస్తాడు.. అతనే ఆర్జీవీ. వర్మ సినిమాను అధ్యయనం చేశాడు. అతను ఫిలాసఫర్ అని అన్నారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నేను ఎవ్వరినీ సీరియస్ గా తీసుకోను.. బ్లూ బుక్ రాశారు అని నాకు ఎవరో చెపితే బ్లు ఫిలిం తెలుసు బ్లూ బుక్ ఎంటి రా అనుకున్నాను.. బ్లూ అంటే ఫిలాసఫీ అని ఎదో అన్నారు. భగవత్ గీత నేను చదివాను కాబట్టి దేవుడ్ని వదిలేసాను.. ఎన్నో పుస్తకాలు చదివిన తరువాత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. మన పెద్దలను, టీచర్స్ చెప్పే వాటిని వినకూడదు అనేది నా పాలసీ. ఎవ్వరినీ ఫాలో అవ్వద్దు నీకు నీలా వుండు అన్నారు. నా గురించి రీసా కలెక్ట్ చేసిన టైం నుంచి నాలో గుణాలు చాలా వరకు మారిపోయి వుంటాయి.. రీసా ప్రయత్నాన్ని రెస్పెక్ట్ చేస్తున్నా.. నన్ను చాలా మంది మంచి సినిమా తియ్యండి అని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు నామీద పెట్టే టైం వాళ్ల పనుల మీద పెట్టుకుంటే బెటర్ అనుకుంటాను. నా ఉద్దేశ్యం లో సక్సెస్ అనేది ఒకరోజు లో మీకు నచ్చినట్టు జీవించడం. నేను 6th క్లాస్ నుంచి చదవడం మానేసి సినిమా చూసే వాడిని..స్కూల్ కాలేజ్ లలో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాము. చంటి పిల్లల వాడు పాలను ఎంత తీవ్రంగా తాగుతాడో నేను నా జీవితాన్ని అలా బతుకుతాను.. దేవుడ్ని నమ్మితే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితంలో న్యాయం గా బతికితే చచ్చిన తరువాత స్వర్గానికి వెళ్తారు అని చెపుతారు అయితే స్వర్గం లోకి వెళితే రంభ, ఊర్వశి, మేనక, అమృతం వుంటాయి .. అవే ఇక్కడ ఒడ్క, అమ్మాయిలు. మనల్ని ఇది తప్పు ఇది ఒప్పు అని చెపుతున్న వాళ్లకు అది తప్పో ఒప్పో వాళ్లకు కూడా తెలీదు. వాళ్ల మీద కూడా ఎవరో రుద్దారు. ఎవరో చెప్పినది కాకుండా నీలాగా నువ్వు ఆలోచించు అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ.
Here’s the link where you can order RGV Blue Book and it’s related merchandise.: https://t.co/Zu50ZPB3SZ @iamkanthrisa pic.twitter.com/irlgW00aNf
— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :




