AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP and Punjab Elections 2022: యూపీ‌, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన టాప్-9 వార్తా విశేషాలు..

ఉత్తర ప్రదేశ్‌లో మూడో విడత పోలింగ్.. పంజాబ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఆదివారంనాడు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 

UP and Punjab Elections 2022: యూపీ‌, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన టాప్-9 వార్తా విశేషాలు..
Assembly Elections
Janardhan Veluru
|

Updated on: Feb 19, 2022 | 3:29 PM

Share

Uttar Pradesh and Punjab Elections 2022: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న మరో కీలక ఘట్టనికి రంగం సిద్ధమయ్యింది.  ఉత్తర ప్రదేశ్‌లో మూడో విడత పోలింగ్.. పంజాబ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఆదివారంనాడు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  యూపీలో కంటిన్యూ అవుతోన్న ఘర్షణలు.. పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు.. ప్రచారంలో దూసుకెళ్తున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఇలాంటి టాప్‌9  వార్తల్ని పాంచ్‌ పటాకాలో చూద్దాం..

  1. లోక్‌సభ ఎన్నికలకు సైమీఫైనల్స్‌గా చెప్పుకునే ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం ఒకే విడతలో జరిగే పంజాబ్‌ పోలింగ్‌తో పాటు, ఉత్తర్‌ప్రదేశ్‌‌లో మూడో విడత పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగిసింది. పంజాబ్‌, యూపీలో చివరిరోజు ప్రధాన పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి.
  2. యూపీ గోసాయిగంజ్‌ నియోజకవర్గంలో ఘర్షణ జరిగింది. కబీర్‌పూర్‌లో బీజేపీ, ఎస్పీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘర్షణ సమయంలో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు ఎస్పీ నేతలు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పూర్తి కథనం..
  3. ఉత్తరప్రదేశ్‌లో యాదవుల ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలకు మూడో విడతలో ఆదివారంనాడు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రెండుదశల్లో మెరుగ్గా రాణించినట్లు భావిస్తున్న అఖిలేశ్ యాదవ్.. ఈ దశ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు అండగా ఉండే యాదవుల ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతున్నారు.
  4. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. వీరు గడువు ముగిసినప్పటికీ ప్రచారం చేసినందుకు మాన్సా జిల్లాలో కేసు నమోదైంది. రేపు జరిగే ఎన్నికల కోసం ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.
  5. ములాయంసింగ్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది బీజేపీ. ములాయం ఆత్మ తన కోడలుతోనే ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్‌శుక్ల. సమాజ్‌వాదీ పార్టీపై ములాయంకు ప్రేమ లేదన్నారు. ఇటీవల ఎస్పీ తరఫున ములాయం సింగ్ యాదవ్ ప్రచారం చేపడుతున్నారు. కాగా ప్రత్యేక బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న అఖిలేష్‌ యాదవ్‌ను చూడటానికి జనం ఎగబడుతున్నారు. కుటుంబం గురించే పదేపదే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటాన్ని అఖిలేష్‌ తప్పుబట్టారు. కుటుంబం ఉన్నవారికే ఆ బాధ తెలుస్తుందనీ, కుటుంబం లేనివారికి ఆ బాధ తెలియదన్నారు.
  6. కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కొంటున్న పారిశ్రామికవేత్తలు ఉద్యోగాలు సృష్టించడం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ విమర్శించారు. ఉద్యోగాలు సృష్టించిన ప్రభుత్వరంగ సంస్థలను ఈ ప్రభుత్వం తన పారిశ్రామిక మిత్రులకు అమ్ముకుంటోందని తప్పుబట్టారు.
  7. పంజాబ్‌లో ఎలక్షన్‌కు రెండ్రోజుల ముందు ఓట్లకోసం సీఎం చన్నీ, అమిత్‌షా మంచి డ్రామా ఆడుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. తానూ ఖలిస్తాన్‌ వేర్పాటువాద సానూభూతి పరుడనే కుమార్‌ విశ్వాస్‌ ఆరోపణలతో రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల బంధాన్ని కామెడీతో పోల్చారాయన.
  8. తాను అందరి లైలాను అంటూ మజ్లిస్‌ అధినేత ఒవైసీ వ్యాఖ్యానించారు. అందుకే తనకు రోజూ బెదిరింపులు వస్తున్నాయని చెప్పారాయన. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయననీ, నిజాలు చెబుతానంటూ- బుందేల్‌ఖండ్‌లోని మహోబాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
  9. యూపీలోని ఫిరోజాబాద్‌లో రామ్‌దాస్‌ మానవ్‌ అనే స్వతంత్ర అభ్యర్థి సంకెళ్లు వేసుకుని, చిప్ప పట్టుకుని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రామ్‌దాస్‌ అక్కడ బ్యాంగిల్‌ వర్కర్ల యూనియన్‌ నాయకుడు. బ్యాంగిల్‌ వర్కర్ల బంధనాలు విడిపిస్తానంటూ సింబాలిక్‌గా ప్రచారం చేస్తున్నారు.

Also Read..

APPSC ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ.. తెలంగాణ, ఏపీ నుంచి టాప్-9 తాజా వార్తా విశేషాలు

Andhra Pradesh: ఊరంతా నిర్మానుష్యం.. పుశువులతో సహా మాయం.. అసలు ఏమిటీ చిత్రం..?