Earthquake: నార్త్ ఇండియాలో భూకంపాలు ఎక్కువ.. రెండు నెలల్లో100 సార్లు ప్రకంపనలు.. కారణం ఏంటంటే..?
Earthquake: రాజస్థాన్‌లోని కొన్ని నగరాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. సికార్‌లో భూకంప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా అనేక భూకంప
Earthquake: రాజస్థాన్‌లోని కొన్ని నగరాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. సికార్‌లో భూకంప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా అనేక భూకంప ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ ఢిల్లీ, NCR ప్రాంతంలో భూకంపాల సంభవిస్తున్నాయి. భారతదేశం మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో కూడా భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే ఉత్తర భారతంలో మాత్రమే భూకంపాలు ఎక్కువగా ఎందుకు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భూకంపం ఎందుకు సంభవిస్తుంది..?
వాస్తవానికి భూమి అనేక పొరలుగా విభజించబడి ఉంది. ఒక ప్లేట్‌కి మరొక ప్లేట్ అతుక్కొని ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్లేట్లలో మార్పులు సంభవిస్తాయి. వీటి ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. భూకంపాల వల్ల చాలా నీరు భూమిపైకి వస్తుంది. శాస్త్రవేత్తలు భూమి లోపలి పొరల్లోని భౌగోళిక కదలికల ఆధారంగా కొన్ని మండలాలని నిర్ణయించారు. వీటి ఆధారంగా భారతదేశం 5 జోన్‌లుగా విభజించారు. వీటి ప్రకారం.. జోన్-5 లో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. తర్వాత జోన్ 4, జోన్ 3 ఇలా వరుస క్రమంలో ఉన్నాయి.
ఎన్ని భూకంపాలు సంభవించాయి?
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి 18, 2022 వరకు దేశంలో, దాని పరిసర ప్రాంతాలలో కలుపుకొని దాదాపు 166 భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఇవి రిక్టర్ స్కేలుపై 2 నుంచి 6 తీవ్రతగా ఉన్నాయి. వీటిలో 5 నుంచి 6 తీవ్రత ఉండేవి 7 మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ-NCR ప్రాంతం సీస్మిక్ జోన్-4లో ఉంటుంది. అందుకే ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. దీంతో పాటు, యురేషియా వంటి టెక్టోనిక్ ప్లేట్లు కలవడం వల్ల ఏర్పడిన హిమాలయాలకు ఢిల్లీ సమీపంలో ఉంటుంది. ఈ ఎఫెక్ట్ వల్ల కూడా ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి.