Crime News: వివాహితపై యువకుడి అత్యాచార ప్రయత్నం.. ప్రతిఘటించడంతో దారుణ హత్య..

దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai) లో దారుణం చోటుచేసుకుంది. పొరుగింట్లో నివాసం ఉన్న మహిళపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు.

Crime News: వివాహితపై యువకుడి అత్యాచార ప్రయత్నం.. ప్రతిఘటించడంతో దారుణ హత్య..
Harassment
Follow us
Basha Shek

|

Updated on: Feb 19, 2022 | 5:06 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai) లో దారుణం చోటుచేసుకుంది. పొరుగింట్లో నివాసం ఉన్న మహిళపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో దారుణంగా అంతమొందించాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సోఫాలో చుట్టి ముట్టాడు. అయితే మృతురాలి భర్త, కుమారుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొరుగున నివాసం ఉన్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుప్రియా కిషోర్‌ షిండే(33) ముంబయిలోని దావ్‌డిగాలో నివాసముంటోంది. ఆమెకు భర్త, 11 ఏళ్ల కూతురు కూడా ఉంది. వీరి పొరుగున ఉన్న ఇంట్లోనే విశాల్ ఘావత్ (25) అనే యువకుడు నివాసముంటున్నాడు. సుప్రియ కన్నేసిన ఆ కామాంధుడు ఎప్పడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూశాడు. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 15న సుప్రియ ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసిన విశాల్‌ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే సుప్రియ కేకలు వేస్తూ బయటికెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చిన నిందితుడు ఓ పదునైన ఆయుధంతో ఆమె తలపై కొట్టాడు. అనంతరం నైలాన్‌ తాడును గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై మృతదేహం ఎవరికీ కనిపించకుండా సోఫాలో చుట్టి వెళ్లిపోయాడు.

పక్కా ప్రణాళికతో.. కాగా తన భార్య కనిపించడం లేదంటూ సుప్రియా భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మృతురాలి భర్త పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు నిందితుడు కూడా అతనితో పాటే వెళ్లాడు. మృతురాలు కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే ఇంట్లో అనుమానాస్పదంగా చుట్టబడిన సోఫాలో భార్య మృతదేహం కనుగొనడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘావత్‌ను తమదైన శైలిలో విచారించారు. చివరకు నిందితుడు నేరం అంగీకరించాడు. కాగా హత్యాచారానికి ముందు రోజే నిందితుడు నిందితుడు పక్కా ప్రణాళికలు వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరదాగా సుప్రియా ఇంటికెళ్లి పిల్లలు ఎప్పుడు పాఠశాలకు వెళతారు? భర్త ఎప్పుడు పనికి వెళతారు?అన్న విషయాలపై ఆరా తీశాడు. ఆ మరుసటి రోజు అదను చూసి ఇంట్లోకి ప్రయత్నించాడు. సుప్రియపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా అంతమొందించాడు.

Also Read:Pushpa: పుష్ప యూనిట్‌కు కీలక సూచనలు చేసిన అల్లు అర్జున్‌.. ఆ తప్పు మళ్లీ చేయొద్దంటూ..

Hrithik Roshan: రక్తదానం చేసిన బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో.. క్రిష్‌ సినిమాతో ముడిపెట్టిన నెటిజన్‌..

Hrithik Roshan: రక్తదానం చేసిన బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో.. క్రిష్‌ సినిమాతో ముడిపెట్టిన నెటిజన్‌..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!